కుప్పకూలిన శ్రీలంక టాప్ ఆర్డర్
గాలే, ఆగస్టు 12 : భారత్, శ్రీలంక జట్ల మధ్య బుధవారం ఆరంభమైన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక 62/5 వికెట్లు కోల్పోయి కష్టాల్లోచిక్కుకుంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక ఓపెనర్లు కరుణరత్న(9), కౌశల్ సిల్వ(5) భారత్ పేసర్లు ఇషాంత్, అరోన్ దెబ్బకు వెంట వెంటనే వెనుదిరిగారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సంగర్కర్ కూడా 5 పరుగుల చేసి అశ్విన్ బౌలింగ్‌లో లోకేశ్ రాహూల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరడంతో లంకకు కష్టాలు ఆరంభమయ్యాయి. ఆ తరువాత వచ్చిన తిరిమన్నె, ముబారక్‌ను కూడా అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో బురిడీ కొట్టించడంతో లంక 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది.