కుమారుడితో సహా దంపతుల ఆత్మహత్యాయత్నం

కరీంనగర్: జిల్లాలోని గోదావరిఖని సంతోష్‌నగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో దంపతులు కుమారుడితో సహా ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిని గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.