కుమార్ విశ్వాస్‌కు భద్రత పెంపు
న్యూఢల్లీి,జూలై14(జనం సాక్షి): ప్రముఖ హిందీ కవి, వ్యాపారవేత్త, లెక్చరర్, ఆమ్ ఆద్మీపార్టీ మాజీ నాయకుడు కుమార్ విశ్వాస్‌కు భద్రతను మరింత పెంచారు. వై నుంచి వై ప్లస్ కేటగిరి సెక్యూరిటీని కల్పిస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ గురువారం నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఆధారంగా కుమార్ విశ్వాస్ భద్రతను కేంద్రహోం మంత్రిత్వశాఖ అప్‌గ్రేడ్ చేసింది. కుమార్ విశ్వాస్ కు గతంలో వై కేటగిరీ భద్రతను కేటాయించారు.అనంతరం ఆయనకున్న హెచ్చరికల దృష్ట్యా వై ప్లస్ భద్రత కల్పించారు.ఈ భద్రతలో 11 మంది సాయుధ పోలీసు కమాండోలను మోహరించారు. 11 మందిలో ఐదుగురు స్టాటిక్ పోలీసు సిబ్బంది భద్రత కోసం వీఐపీ ఇంటి పరిసరాల్లో నివసిస్తారు. అలాగే మూడు షిఫ్టుల్లో ఆరుగురు ప్రొటెక్టివ్ సర్వీస్ ఆఫీసర్లు గార్డులు సెక్యూరిటీగా ఉంటారు.