కూసుమంచి ఆరోగ్య కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం
కూసుమంచి ఆగస్టు 17 ( జనం సాక్షి ) : భారత స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికానున్నందున వజ్రోత్సవాలు జరుపుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన మీదట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వేసిన రాష్ట్ర వజ్రోత్సవాల రోజు వారి కార్యక్రమాల నిర్వహణ కమిటీ పర్యవేక్షణలో ఈనెల 8వ తారీకు నుండి ఇదే నెల 22వ తారీకు వరకు 15 రోజులపాటు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ ఆదేశానుసారం ఈరోజు మండలంలోని వైద్య ,ఆరోగ్య కేంద్రంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి ఆదేశానుసారం మండల నోడల్ అధికారి డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ రాంబాబు సారధ్యంలో మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ ఇవాంజెలిన్ పర్యవేక్షణలో మెగా రక్తదాన శిబిరాన్ని బుధవారం రోజున స్థానిక సర్పంచ్ చెన్నా మోహన్ ప్రారంభించారు ఈ రక్తదాన శిబిరానికి నేలకొండపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి జమాలా రెడ్డి, ఎంపిఓ సి. హెచ్ శివ తో పాటుగా సుమారుగా 80 మంది దాతలు రక్తదానం చేశారు అనంతరం అనేక దఫాలుగా 40 సార్లు రక్తదానం చేసిన ముగ్గురు దాతలను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి, నేలకొండపల్లి, తాసిల్దార్లు మీనన్, రామచంద్ర రావు, కూసుమంచి మండల అభివృద్ధి అధికారి కరుణాకర్ రెడ్డి, వైద్య ఆరోగ్య సిబ్బంది, మండల పంచాయతీ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.