కృష్ణంరాజుకు అంతిమ వీడ్కోలు

` ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు
మొయినాబాద్‌(జనంసాక్షి):సినీ నటుడు మాజీ మంత్రి క్రిష్ణం రాజు అంత్యక్రియలు హైదరాబాద్‌ శివారులోని  మొయినాబాద్‌ మండలం కనక మామిడి గ్రామంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో  అధికార లాంచనాలతో పూర్తయ్యాయి . మధ్నాహ్నం రెండున్నర గంటల సమయంలో హైదరాబాద్‌ నుంచి మొయినాబాద్‌ విూదుగా కనక మామిడి చేరుకున్న ఆయన పార్థీవదేహం  ఆయన వ్యవసాయ క్షేత్రానికి భారిగా అభిమానులతో  చేరుకుంది . ప్రభుత్వ అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసుల మూడు రౌండ్ల కాల్పులు నిర్వహించారు . హైజరైన సినీ ప్రముఖులు, నాయకులు కనక మామిడి వ్యవసాయ క్షేత్రానికి భారిగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు మోహన్‌ బాబూ తో పాటు ఇతర సినీ పెద్దలు అక్కడికి చేరుకోగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ , బీజేపీ నాయకులు జీతేందర్‌ రెడ్డి , మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తో పాటు ఎమ్యెల్యే కాలే యాదయ్యలు హాజరయ్యారు .

తాజావార్తలు