కెసిఆర్‌తో అఖిలేశ్ యాదవ్ భేటీ
తాజా రాజకీయాలపై రెండు గంటలపాటు చర్చ
న్యూఢల్లీి,జూలై29(జనంసాక్షి ):ఢల్లీి పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఢల్లీి టూర్‌లో భాగంగా ఆయన.. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో భేటీ ఆయ్యారు. బాబాయ్ శివపాల్ యాదవ్ తో కలిసి అఖిలేష్ కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఇరువురు నేతలకు ముఖ్యమంత్రి బొకే ఇచ్చి స్వాగతం పలికారు.సీఎం కేసీఆర్, అఖిలేష్ సమావేశం దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై ముగ్గురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని టాª`గ్గంªట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు విపక్ష నేతలతో భేటీ అవుతున్నారు. గతంలో ఢల్లీి పర్యటన సందర్భంగా పలువురు రాజకీయ, ఇతర ప్రముఖులతో భేటీ అయ్యారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పట్లో ఢల్లీి పర్యటనను మధ్యలోనే ముగించుకుని హైదరాబాద్ వచ్చారు.