కేంద్రంతో పోలిస్తే ఎపి ఆర్థిక పరిస్థితే మెరుగు
కేంద్రం తన అప్పులను విస్మరించి మాట్లాడుతోంది
ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు దుష్పచ్రారం
మండిపడ్డ ఎంపి విజయసాయి రెడ్డి
న్యూఢల్లీి,జూలై28(జనంసాక్షి ): కేంద్రంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితే మెరుగ్గానే ఉందని, వైఎస్ జగన్ లాంటి సమర్థ నాయకత్వం చేతిలో ప్రభుత్వం పని చేస్తోందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాష్టాల్ర అప్పుల గురించి మాట్లాడుతున్న కేంద్రం తమ అప్పుల గురించి మాట్లాడడంలేదన్నారు. ఏపీ ఆర్థిక స్థితిపై కావాలనే దుష్పచ్రారం చేస్తున్నారని, అసలు రాష్టాల్ర విషయంలో కేంద్రంతీరు సరిగా లేదని ఆయన మండిపడ్డారు. ఈమేరకు గురువారం న్యూఢల్లీిలో ఆయన విూడియాతో మాట్లాడారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంది. చంద్రబాబు కావాలనే దుష్పచ్రారం చేస్తున్నారు. కానీ, రాష్ట్రం సీఎం జగన్ లాంటి సమర్థ నాయకుడి చేతిలో ఉంది. ఒకరకంగా కేంద్రం కంటే ఏపీ పరిస్థితినే ఆర్థికంగా మెరుగ్గా ఉంది. 2021`22 సంవత్సరంలో కేంద్రం జీడీపీ 57 శాతంగా ఉంది. ఏపీ జీడీపీ ఐదో స్థానంలో ఉంది. ఎగుమతుల్లోనూ ఏపీ ఎంతో అభివృద్ధి సాధించింది. కానీ, కేంద్రం నుంచి రాష్టాన్రికి వచ్చే పన్నుల ఆదాయం తగ్గింది. కేంద్రానికి పన్నుల ఆదాయం పెరిగినా రాష్టాల్రకు మాత్రం సరైన వాటా ఇవ్వడం లేదు. 41 శాతం పన్నుల వాటా కేంద్రం ఇస్తున్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. సెస్, సర్‌ఛార్జీలు కేంద్రం ఏటా పెంచుతోంది. కానీ, ఆ ఆదాయం మాత్రం కేంద్రం ఇవ్వడం లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్టాల్ర అప్పుల గురించి మాట్లాడుతున్న
కేంద్రం.. తన అప్పుల సంగతిపై ఏం చెబుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి నిలదీశారు. 2014`19లో కేంద్రం అప్పులు 60 శాతం పెరిగితే , చంద్రబాబు హాయంలో రాష్ట్రంలో 117 శాతం అప్పులు పెరిగాయి. కేంద్రం 2019 నుంచి ఇప్పటి వరకు 50 శాతం అప్పులు చేస్తే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో కేవలం 43 శాతం అప్పులు మాత్రమే పెరిగాయి. నాటి చంద్ర బాబు ప్రభుత్వం అయిదుగురు కోసం పని చేస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అయిదు కోట్ల మంది ప్రజల అభివృద్ధికి పని చేస్తుంది అని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. జాతీయ రహదారుల విషయంలో ఏ రాష్టాన్రికి రాని నిధులు ఏపీకి వచ్చాయి. రైతు భరోసా కేంద్రాలు, వాలంటరీ వ్యవస్త ను అధ్యయనం చేసేందుకు ఇతర రాష్టాల్ర ప్రభుత్వాలు వస్తున్నాయి. ఉపాధి హావిూ పథకం కింద నిధులు తీసుకు రావడంలో ఎంపీలందరం సమిష్టిగా పని చేస్తున్నాం. జల్ జీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ పథకం కింద రాష్ట్రంలో సురక్షిత జలాలు ఇస్తున్నాం. అయినా టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి పేర్కొన్నారు.