కేంద్రంపై పోరాటం ఉదృతానికి తెదేపా సన్నద్ధం
– మరోసారి పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం
– తొలిరోజే స్పీకర్ అవిశ్వాస తీర్మానం ఇవ్వాలని ఎంపీలకు చంద్రబాబు ఆదేశం
– పార్లమెంటులో పోరాటంతో ఫలితం లేకపోతే న్యాయపోరాటం చేద్దామన్న చంద్రబాబు
అమరావతి, జులై13(జనం సాక్షి) : ప్రత్యేక ¬దా, విభజన హావిూల కోసం కేంద్రంపై చేస్తున్న పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి టీడీపీ సిద్ధమైంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై మరోసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు టీడీపీ సిద్ధమైంది. సమావేశాల తొలిరోజే మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ స్పీకర్ కు లేఖ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయించింది. తీర్మానంపై 50 మంది సభ్యుల మద్దతు ఖాయమని.. మిగిలిన పార్టీల మద్దతు కోరాలని ఎంపీలకు బాబు సూచించారు. ఎంపీలు బృందాలుగా ఏర్పడి అన్ని రాష్ట్రాలకు వెళ్లి బీజేపీ, కాంగ్రేతర పార్టీల ఎంపీలను కలవాలని నిర్ణయించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించే పుస్తకాన్ని, సీఎం రాసిన లేఖను వారికి అందించి అవిశ్వాసానికి మద్దతు కోరనున్నారు. అమరావతిలోని ప్రజాదర్బార్ హాల్లో ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రతి హావిూపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ ఎంపీలకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని బాబు ఎంపీలను ఆదేశించారు. స్వయంగా తాను విపక్ష నేతలకు ఫోన్ చేసి సంఘీభావం తెలపాలని కోరతానని చంద్రబాబు చెప్పారు. పార్లమెంటులో పోరాటంతో ఫలితం లేకపోతే చివరగా న్యాయపోరాటం చేద్దామని తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ముగియగానే విభజన చట్టం, హావిూల అమలుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయిద్దామన్నారు. వైసీపీ ఎంపీల రాజీనామాల వల్ల బీజేపీకే మేలు జరిగిందని సమావేశంలో విశ్లేషించారు. అవిశ్వాసంపై ఓటింగ్ లో పాల్గొనకుండా వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వం పడిపోయే ప్రమాదాన్ని తప్పించారని టీడీపీ ఎంపీలు ఆరోపించారు.