కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికులు ఉద్యోగులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి.సిఐటియు నేతల పిలుపు ..


ఖమ్మం జిల్లా. తిరుమలయపాలెం (నవంబర్ 08) జనంసాక్షి. తిరుమలాయపాలెం మండల పరిధిలోని దమ్మాయిగూడెం లో జరిగిన. ఈ మహాసభలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ విష్ణువర్ధన్, కళ్యాణం వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు ఎర్ర శ్రీకాంత్ పాల్గొని మాట్లాడుతూ ప్రజల సంపదైన ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తున్నదని వారు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వల్ల దేశ ప్రజానీకం అష్టకష్టాలుపడ్డారు.
ప్రజలకు తగిన ఆదాయాలు, ఉపాధి, ఆరోగ్య భద్రత ఏవీ కల్పించకుండా బిజెపి ప్రభుత్వం అమలుపరుస్తున్న విధానాలను అడ్డుకోవడానికై కేంద్ర,
కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు ఇప్పటికి దేశవ్యాప్తంగా సమ్మెలు చేసినప్పటికీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని వారు తెలిపారు.
వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులన్నీ రోజూ పెరుగుతూనే వున్నాయి. కార్మికుల జీతాలు మాత్రం పెరగటం లేదు.
కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం రద్దు చేసి యజమానులకు అనుకూలంగా, కార్మికులకు
వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లుగా మార్చేసింది. సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు కనీస వేతనాలు, లేబర్ డిపార్ట్మెంట్స్లో
సంప్రదించే తదితర హక్కులన్నీ కనుమరుగవుతున్నాయని,
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరించడం, కాంట్రాక్టు కార్మికులకు
కనీస వేతనాలు నెలకు 26 వేల రూపాయలుగా నిర్ణయించాలనే తదితర డిమాండ్స్ వేటిని పట్టించుకోకుండా మోడీ ప్రభుత్వం ఆదాని,
అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలను పన్నుల్లో రాయితీలు, బ్యాంకు రుణాల మాఫీ పేరుతో దోచి పెట్టింది. వారి
సంపదలు మాత్రం మూడింతలు పెరిగాయి. కానీ మనలను మాత్రం పేదరికంలోకి నెట్టివేయబడేటట్లు చేసిందని విమర్శించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. నూతన కన్వీనర్ గా వి వీరన్న ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. 20మందితో కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పి. మోహన్ రావు, ఏవిపిఎస్ జిల్లా నాయకులు కొమ్ము శ్రీను, రైతు సంఘం నాయకులు నరసయ్య, సిఐటియు నాయకులు పాషా, మంగపతి, నాగలక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు.