కేంద్రం అహంకారపూరిత ధోరణి


` ఇది సమైఖ్యస్పూర్థికి తూట్లు
` తెలంగాణ రైతులను అవమానించిన కేంద్రం
` పాడిరదే పాటగా పీయూష్‌ గోయల్‌ తీరు
` ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వని కేంద్రమంత్రి
` బిజెపిది దౌర్భాగ్య ప్రభుత్వం తప్ప మరోటి కాదు
` వడ్లను కొనమంటే రా రైస్‌ అంటూ తప్పించుకున్న కేంద్రం
` సిఎం కెసిఆర్‌తో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తాం
` పీయూష్‌తో భేటీ తరవాత విూడియాతో మాట్లాడిన మంత్రి నిరంజన్‌ రెడ్డి
న్యూఢల్లీి,మార్చి 24(జనంసాక్షి): కేంద్రమంత్రి పాతపాటే పాడి తెలంగాణను మరోమారు మోసం చేశారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పండిరచిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో మడపేచీ పెట్టి గతంలో లాగానే సమాధానం ఇచ్చి తప్పించుకున్నారని మండిపడ్డారు. ఇతంటి దౌర్భాగ్య ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. హైదరాబాద్‌ వెళ్లాక సిఎం కెసిఆర్‌తో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయిస్తామని అన్నారు. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి ధధాన్యం సేకరణపై చర్చించన తరవాత మంత్రుల బృందం ఢల్లీిలో విూడియాతో మాట్లాడిరది. ఈ సందర్బంగా నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ యాసంగిలో వచ్చే వడ్లను మొత్తం కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్‌ చేశారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం వత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌తో తెలంగాణ మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌ భేటీ అయ్యారు. కేంద్రం తీరు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని తప్పుబట్టారు. తమది రైతు వ్యతిరేక ప్రభుత్వమని కేంద్రమంత్రి అనడాన్ని తప్పు పట్టారు. తమకన్నా ముందే ఆయన విూడియాతో మాట్లాడడాన్నికూడా తప్పుపట్టారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నందుకు రైతు వ్యతిరేకులమా?.. రైతుబంధు, సాగునీరు ఇస్తున్నందుకు రైతు వ్యతిరేకులమా?.. పంటలు కొనకుండా ఇబ్బందులు పెడతారా? అని ప్రశ్నించారు. కరోనా సమయంలో పేదలకు 60 కిలోల బియ్యం ఇవ్వాల్సిందేనని తెలిపారు. వరి సాగు తగ్గించాలని తామంటే.. బీజేపీ పెంచాలని చెప్పిందని గుర్తుచేశారు. వడ్లను వడ్లలాగా తీసుకోవాలని అంటే కేంద్రమంత్రి గోయల్‌ అవహేళనగా మాట్లాడారని తప్పుబట్టారు. బఫర్‌ స్టాక్‌ పెట్టుకోవచ్చు కదా అంటే గోయల్‌ నవ్వుతున్నారని, తెలంగాణ రైతులకు కూడా క్షమాపణ చెప్పేరోజు వస్తుందని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పే పరిస్థితి వస్తుంది. ఈ పరాభవాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరని అన్నారు. ఏ అంశంలోనూ నవ్యత్వం లేదు. కేంద్ర ప్రభుత్వానికి వ్యాపారధోరణితో వ్యవహరించడం తప్పితే, సంక్షేమం గురించి ఆలోచించే మనసే లేదు. ముఖ్యమంత్రి ఆలోచించి తదుపరి కార్యాచరణ ఖరారు చేస్తాం. అయితే, ఏది ఏమైనా, రైతుల ప్రయోజ నాలను మా ప్రభుత్వం పరిరక్షిస్తుంది. తెలంగాణ రైతులు అధైర్యపడవద్దన్నారు. రైతులు పండిరచిన వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు ఏ మాత్రం మారలేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. వడ్ల కొనుగోలు భాధ్యత కేంద్రానిదే అయినప్పటికీ రాష్టాల్రపైనే నెడుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిన కేంద్రం బాధ్యతను రాష్టాల్రపైకి నెడుతున్నారని, రాష్ట్రమే వడ్లు కొనుగోలు చేయాలంటే ఎలా సాధ్యమని, రాష్టాల్రకు స్టోరేజీ కోసం ఏం వ్యవస్థ ఉందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరలిజం అనే మాటకు అర్థం లేకుండా చేస్తోందని, పదేండ్ల క్రితం మోడీ మాట్లాడిన మాటలకు ఈ రోజు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. నాటి యూపీఏ ప్రభుత్వం ఇతర పార్టీల ప్రభుత్వం ఉన్న రాష్టాల్రను నిర్లక్ష్యం చేసిందని మోడీ ఆరోపించారని, ఈ రోజు మోడీ సర్కారు కూడా ఎన్డీయే మిత్రపక్షాలు కాని ప్రభుత్వాలున్న రాష్టాల్రకు అన్యాయం చేస్తోందని అన్నారు. కేంద్రం తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అన్నారు. ధాన్యం సేకరణ బాధ్యత కేంద్రానిదే అని, రైతుల నుంచి వడ్లు తీసుకుని మిల్లర్లతో కేంద్రమే బియ్యం పట్టించు కోవాలని ఆయన అన్నారు. కానీ రాష్టాల్రే వడ్లు కొని కేంద్రానికి బియ్యం ఇవ్వాలని పీయూష్‌ గోయల్‌ చెప్పడం విడ్డూరంగా ఉందని నిరంజన్‌ రెడ్డి మండిపడ్డారు. మార్కెట్‌ లో అమ్ముడుపోయే ధాన్యమే కొంటామని కేంద్రం చెబుతోందని, ఇదేం నీతి అని ప్రశ్నించారు. కేంద్ర సర్కారులో వ్యాపార కోణం తప్ప రైతు సంక్షేమ కోణం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వచ్చేదే బాయిల్డ్‌ రైస్‌ అంటే ఎంతసేపు ఆయన రా రైస్‌ ఎంతిస్తారో చెప్పాలని అంటారే తప్ప మరో మాట మాట్లాడం లేదని అన్నారు. తెలంగాణ లో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగిలో పండే ధాన్యంలో నూక ఎక్కువగా వస్తుందని అన్నారు. కేంద్రం మంత్రి చెప్పిందే చెప్పి.. మన రాష్ట్ర రైతులను అవమానించేలా మాట్లాడారని అన్నారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన బీజేపీ సర్కారు.. ఇయ్యాల కనీసం రైతులు పండిరచిన పంటను కొనుగోలు చేయలేని స్థితిలో ఉందన్నారు. చిన్న సన్నకారు రైతులకు పెన్షన్‌ ఇస్తామని చెప్పారని, కానీ ఆ హావిూని నేటికీ అమలు చేయలేదని అన్నారు. అగ్రి చట్టాలను తెచ్చి రైతుల నిరసనలతో వాటిని వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. విూడియా సమావేశంలో మంత్రలుతో పాటు ఎంపిలు కూడా పాల్గొన్నారు.

.మీరు అధికారంలోకి వచ్చి విధానాలు మార్చండి
` ధాన్యం కొనమంటే కొనం: పియూష్‌గోయల్‌
` మీడియా సమావేవానికి కిషన్‌రెడ్డి గైర్హాజరు
న్యూఢల్లీి,మార్చి 24(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ఆహార పౌర సరఫరాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ నిప్పులు చెరిగారు. రైతులను అడ్డం పెట్టుకుని సీఎం కేసీఆర్‌ రాజకీయం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. రా రైస్‌ ఎగుమతిపై తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా స్పష్టతనివ్వడం లేదని పీయూష్‌ గోయల్‌ అన్నారు. పార్లమెంటులోని మంత్రి ఛాంబర్‌లో తెలంగాణా మంత్రులు నిరంజన్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌ భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు సమావేశం జరిగింది. అనంతరం పీయూష్‌ గోయల్‌ విూడియాతో మాట్లాడారు. పంజాబ్‌లో మాదిరిగానే తెలంగాణలోనూ బియ్యం సేకరణ జరుగుతోంది. అన్ని రాష్టాల్ర మాదిరిగానే రా రైస్‌ కూడా కొంటాం. రా రైస్‌ ఎంత ఇస్తారనేదానిపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదన్నారు. మిగతా రాష్టాల్రన్నీ స్పష్టతనిచ్చాయి. టీఆర్‌ఎస్‌ అబద్దాలు చెబుతూ రైతులను మోసం చేస్తున్నదని అన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా దేశమంతటా బియ్యం సేకరణ చేస్తోందని పీయూష్‌ గోయల్‌ చెప్పారు. అన్ని రాష్టాల్ర మాదిరిగానే తెలంగాణ నుంచి రా రైస్‌ సేకరణ జరుగుతోందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడిరచారు. కేసీఆర్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన విమర్శించారు. ఒప్పందం ప్రకారమే ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల తమకు ఎలాంటి వివక్ష లేదన్నారు. తెలంగాణ నేతలు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న కేంద్ర మంత్రి.. ప్రజలను అక్కడి ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. తెలంగాణ రైతులకు బాసటగా ఉంటామని కేంద్ర మంత్రి అన్నారు. తెలంగాణ పట్ల మాకు ఎలాంటి వివక్ష లేదు. తెలంగాణ నేతలు మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను అక్కడి ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది.తెలంగాణ రైతులకు బాసటగా ఉంటాం. ముడిబియ్యం సేకరణకు తెలంగాణ సహా అన్ని రాష్టాల్రతో ఒప్పందం. పంజాబ్‌తో అనుసరిస్తున్న విధానమే తెలంగాణలోనూ అమలు చేస్తాం. పంజాబ్‌, తెలంగాణ రెండు మాకు సమానమే. ఏపీ 25లక్షల మెట్రిక్‌ టన్నుల ముడిబియ్యం ఇచ్చింది. కేసీఆర్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం తెలంగాణ రైతులపై ఎలాంటి వివక్ష చూపడం లేదు. రైతుల పట్ల నేతలు నిజాయితీగా ఉండాలి. కేంద్రం రైతులకు చేయాల్సింది చేస్తుంది. రైతులపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే విూ బాధ్యత నెరవేర్చండి. ముడిబియ్యం సరఫరా చేస్తామని తెలంగాణ లిఖితపూర్వకంగా వెల్లడిరచింది. తెలంగాణ అవసరాలు పోగా మిగిలిన ముడిబియ్యం తీసుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణపై మాకు ఎలాంటి వివక్ష లేదు. పంజాబ్‌ తరహాలోనే తెలంగాణ నుంచి బియ్యం సేకరణ చేస్తాం. తెలంగాణ రైతులను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిజాయితీతో వ్యవహరించాలి. తెలంగాణ లిఖితపూర్వకంగా ఇచ్చిన ఒప్పందానికి కట్టుబడి ఉండాలని కేంద్రమంత్రి అన్నారు. ధాన్యం సేకరణపై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలన్నారు. ఏపీ కూడా 25లక్షల మెట్రిక్‌ టన్నుల ముడిబియ్యం ఇస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ముడిబియ్యం సప్లై విూద ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఫిబ్రవర 25న అన్ని రాష్టాల్రను పిలిచి, ఎవరెంత ఇస్తారో అడిగాం. అన్ని రాష్టాల్రు సమాచారం ఇచ్చినా, తెలంగాణ మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. సమాచారం ఇవ్వకుండా రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది.

తాజావార్తలు