కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది

– చివరి నిమిషంలో విశాఖ ఉత్సవ్‌లో ఎయిర్‌షోను రద్దు చేశారు
– సమయం ఇవ్వకుండా హైకోర్టును విభజించారు
– పట్టుదలతో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్నాం
– నాలుగేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశాం
– 2019లో పోలవరం కాలువల ద్వారా నీళ్లిస్తాం
– రాబోయే రోజుల్లో రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌గా మారుతుంది
– అవినీతి నిర్మూలనలో మూడో స్థానంలో నిలిచాం
– మన పనితీరుకు అవార్డులే నిదర్శనం
– శ్వేతపత్రాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
– కలెక్టర్‌ల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, డిసెంబర్‌29(జ‌నంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం ఏపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, దీనికి నిదర్శనం విశాఖ ఉత్సవ్‌లో ఎయిర్‌ షోను చివరి నిమిషంలో రద్దు చేశారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం అమరావతిలోని ప్రజాభవన్‌లో కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సులో  సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడారు.. కాంక్రీట్‌ విభాగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సచివాలయ ర్యాఫ్ట్‌ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. 2019లో పోలవరం కాలువల ద్వారా నీళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ ఉద్యానంలో అనంతపురం జిల్లా టాప్‌గా నిలిచిందని, కొన్ని నీళ్లకే అనంతపురం ఉద్యాన రైతులు అద్భుత ఫలితాలను సాధించారని కొనియాడారు. ఉద్యానంలో పెట్టుబడులు తక్కువ, ఫలితాలు ఎక్కువ అని అన్నారు. రాయలసీమలో నీళ్లను సక్రమంగా వినియోగించుకుంటే రానున్న రోజుల్లో సీమ హార్టికల్చర్‌ హబ్‌గా మారుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. కాలుష్య ప్రభావం, నీరు లేకపోవడం వల్ల ఆక్వా కల్చర్‌లో ప్రకాశం జిల్లా వెనుకబడిందన్నారు. కేంద్రం సహకరించకున్నా 10.52శాతం గ్రోత్‌ రేట్‌ సాధించామని సీఎం పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామన్నారు. శ్రీకాకుళం, విజయనగరంలో తీరప్రాంతం ఉన్నా అవగాహన లేక అభివృద్ధి సాధ్యం కావడంలేదని తెలిపారు. 175నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల అభివృద్ధి చేశామన్నారు. పట్టిసీమకు నీళ్లివ్వడం ద్వారా అనేక సమస్యల నుంచి గట్టెక్కామని తెలిపారు. అవినీతిని చాలావరకు నియంత్రించామని, అవినీతి నిర్మూలనలో మూడో స్థానంలో నిలిచామని సీఎం పేర్కొన్నారు.
ఎకో సిస్టమ్‌ ఏర్పాటు చేయడానికి తగిన వసతులు ఉన్నాయన్నారు. సహజ వనరులకు కొదవలేదని, నైపుణ్యం ఉందని చెప్పారు. హబ్‌ అండ్‌ స్పోక్‌ మోడల్‌లో ఎంఎస్‌ఎంఈల అభివృద్ధి జరిగిందన్నారు. 10 శ్వేత పత్రాలపై రేపటి జన్మభూమి-మఊ/ూరు కార్యక్రమంలో పెద్ద ఎత్తున చర్చ జరగాలని సూచించారు. శ్వేతపత్రాలపై గ్రావిూణ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నాలుగేళ్లుగా వరుసగా వృద్ధిలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. వ్యవసాయంలో వర్షాభావం వల్ల వృద్ధిలో తగ్గుదల కనిపిస్తోందని, సేవారంగంలో తక్కువ పెట్టుబడులు, ఎక్కువ ఆదాయం వస్తుందని తెలిపారు. సర్వీసు సెక్టార్‌లో నిరంతరం దృష్టి పెడితేనే అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. ప్రధాన కార్యదర్శి దీనిపై ఫోకస్‌ పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖ ఉత్సవ్‌ పెడితే అక్కడ ¬టల్‌ గదులు దొరకట్లేదని, పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఏపీకి తిరుగులేదన్నారు. అభివృద్ధికి మౌలిక సదుపాయాలు ప్రధానమన్నారు. ప్రజా
సౌకర్యాలకు ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్ర్‌ ముఖ్యమని సీఎం తెలిపారు. అవార్డుల వివరాలతో ప్రతి నెలా పుస్తకం విడుదల చేస్తామన్నారు. క్వాలిటీ ఆఫ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్ర్‌ రావాలని సమావేశంలో సీఎం అన్నారు. గృహ నిర్మాణంలో విశాఖ విధానం ఒక బెస్ట్‌ మోడల్‌ అని కొనియాడారు. 100 శాతం సంతృప్త స్థాయి ఫలితాలు రావాలని తెలిపారు. సుస్థిర వృద్ధి సాధించాలని, పేదలకు ఆదాయం పెరగాలని అన్నారు. హెల్త్‌ అండ్‌ న్యూట్రీషన్‌లో ప్రభుత్వ సేవల్ని మెరుగుపర్చాలని చెప్పారు. ప్రైవేట్‌ భాగస్వాములు అందించే సేవల్ని పర్యవేక్షించాలని, వ్యర్ధ పదార్థాల సేకరణకు వాహనాలు అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
సమయం ఇవ్వకుండా హైకోర్టును విభజించారు..
విభజన సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయని, సమయం కూడా ఇవ్వకుండా హైకోర్టును విభజించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఉద్యోగులు సిద్ధంగా లేకుండానే హైకోర్టును విభజించారన్నారు. జిల్లా స్థాయి సమస్యల పరిష్కారాలకు కలెక్టర్ల సమావేశం దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు.  జిల్లా, గ్రామస్థాయి ప్రణాళికల రూపకల్పన చేయాలన్నారు. 6వ విడత జన్మభూమి- మఊరూరా కార్యక్రమం గ్రామాలు, వార్డులలో పండగలా జరగనున్నాయన్నారు. ప్రకృతి వ్యవసాయంపై గ్రామసభల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ల సమావేశాలు మేథోమధనానికి ఉపకరిస్తున్నాయన్నారు. కలెక్టర్లు అందరూ విజయాన్ని ఆస్వాదిస్తున్నారని సీఎం తెలిపారు. 635 పురస్కారాలు దక్కడం అరుదైన అనుభవమని హర్షం వ్యక్తం చేశారు. కష్టానికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుందన్నారు. నిరంతరం పనిలోనే నిమగ్నం అవుతున్నామని, పనిలో ఉంటే వేరే ఆలోచనలు కూడా రావన్నారు. మన పనితీరుకు ఈ అవార్డులే నిదర్శనమని చంద్రబాబు చెప్పుకొచ్చారు.