కేంద్రం నిర్లక్ష్య వైఖరిని జగన్‌ ప్రశ్నించాలి

– టీడీపీ అవిశ్వాస తీర్మానానికి అనుమతించడంలో వైసీపీ జీర్ణించుకోలేక పోతుంది
– బీజేపీ సహకారంతో జగన్‌ ఆడిన నాటకం బట్టబయలైంది
– ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల
న్యూఢిల్లీ, జులై19(జ‌నం సాక్షి) : కేంద్రంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్‌ అనుమతించడంతో వైసీపీ జీర్ణించుకోలేక పోతోందని ఆర్థికమంత్రి యనమల మండిపడ్డారు. గురువారం   విూడియాతో ఆయన మాట్లాడారు. అవిశ్వాసంలో వైసీపీ ఎంపీలు పాల్గొనకుండా బీజేపీ సహకారంతో జగన్‌ ఆడిన నాటకం బట్టబయలైందన్నారు. ప్రత్యేక ¬దా,ఇతర అంశాలపై ఆ పార్టీకి చిత్తశుద్ది లేదని తేలిపోయిందన్నారు. జగన్‌ దృష్టి రాష్ట్ర ప్రయోజనాలపై లేదని.. బీజేపీ సహయంతో కేసుల నుంచి బయటపడటమే తన లక్ష్యమని యనమల ఆరోపించారు. అవినీతి కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి అవినీతి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఎద్దేవా చేశారు. కడప ఉక్కు కర్మాగారంపై మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యం జగన్‌కు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.  రాజస్థాన్‌లోని పెట్రో కాంప్లెక్స్‌ పై ప్రత్యేక శ్రద్ద చూపుతున్న మోదీ కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌ కు 5,615కోట్ల రూపాయలు రాష్ట్రమే చెల్లించాలనడంపై జగన్‌ ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను పట్టించుకోని కేంద్రం.. ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్‌కు మాత్రం ఎందుకంత ప్రాధాన్యం ఇస్తుందో జగన్‌ ప్రశ్నించాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ లాంటి బాధ్యతారాహిత్యం కలిగిన నేతలకు ఎక్కడా చూడలేదని యనమల విమర్శించారు. అవిశ్వాస తీర్మానానికి బీజేపీయేతర పార్టీలు మద్దతు పలికేందుకు ముందుకు వస్తున్నాయని, పార్లమెంట్‌లో ఏపీ సమస్యలను లేవనెత్తి దేశవ్యాప్తంగా బీజేపీ తీరును ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.