కేంద్రం ప్రకటనల ఖర్చు రూ.4,880 కోట్లు

– వెల్లడించిన సమాచార, ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్థన్‌ రాథోడ్‌

న్యూఢిల్లీ, జులై31(జ‌నం సాక్షి ) : మోడీ ప్రధాని పీఠం ఎక్కినప్పటి నుంచి నాలుగేళ్లలో కేంద్రం ప్రభుత్వ ప్రకటనల కోసం చేసిన మొత్తం ఖర్చు వింటే తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. 2014 నుంచి ఇప్పటి వరకుఎలక్టాన్రిక్‌, ప్రింట్‌, ఇతర విూడియా సంస్థలకు అక్షరాల రూ.4,880 కోట్లును కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. సమాచార, ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్థన్‌ రాథోడ్‌ ఈ విషయాన్ని రాజ్యసభకు రాతపూర్వకంగా తెలియజేశారు. 2014-15లో రూ.979.78కోట్లు ఖర్చు చేయగా… 2017-18నాటికి ఆ ఖర్చు రూ.1,313.57 కోట్లకు పెరిగింది. మొత్తం ఖర్చులో ప్రింట్‌ విూడియా కోసం రూ.2,128 కోట్లు ఖర్చు చేశారు. ఆడియో, విజువల్‌ విూడియాకు రూ. 2,131.57 కోట్లు, అవుట్‌ డోర్‌ పబ్లిసిటీ కోసం రూ. 620.70 కోట్లు ఇచ్చారు. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ , స్మార్ట్‌ సిటీ మిషన్‌ , సన్‌ సద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన ప్రచారం కోసం భారీగా ఖర్చు చేశారు. 867 ప్రైవేటు ఛానల్స్‌ కు ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం అనుమతి ఇచ్చారు. 236 శాటిలైట్‌ ఛానల్స్‌ కు పలు కారణాలతో అనుమతి ఇవ్వలేదని రాథోడ్‌ తెలిపారు.