కేంద్రమంత్రి నిర్మల తీరు సరికాదు

సాయం ప్రకటించకుండా పర్యటన ఎందుకు: సిద్దరామయ్య
బెంగళూరు,ఆగస్ట్‌24(జ‌నంసాక్షి):  వరదలు, కొండచరియలు విరిగిపడి తీవ్రంగా ప్రాణ, ఆస్తినష్టం జరిగిన కొడగు జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర సాయంపై ఎలాంటి ప్రకటన చేయడకపోవడాన్ని కాంగ్రెస్‌ మాజీ సీఎం సిద్ధరామయ్య తప్పుపట్టారు. ఇటీవల కేరళకు తక్షణ సహాయాన్ని ప్రకటించిన కేంద్రం ఇప్పుడు కొడగు జిల్లా విషయంలో సాయం ప్రకటన చేయకపోవడం చాలా తప్పని అన్నారు.కేంద్ర మంత్రి కొడగులో ఇలా పర్యటించి అలా వెళ్లారు. జిల్లాలో రోడ్డు, ఇళ్లు, నేషనల్‌ హైవేలు ఘోరంగా దెబ్బతిన్నాయి. చాలా పెద్ద నష్టం జరిగింది. మంత్రి ఇదంతా చూసి కూడా కేంద్ర సహాయంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం తప్పు’ అని సిద్ధరామయ్య అన్నారు. కాగా, కొడగు జిల్లాలో సహాయ, పునరావాస చర్యలకు రూ.100 కోట్లు తక్షణ సాయం ప్రకటించాలని ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.