కేంద్రానికి అనుకూలంగా వైసీపీ
– రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో వైసీపీ నాటకం బయటపడింది
– ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు
విజయవాడ, ఆగస్టు9(జనం సాక్షి) : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో వైసీపీ నాటకమాడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ప్రత్యేక ¬దా ఇవ్వన్నందుకు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించి.. ఓటింగ్‌లో వైసీపీ పాల్గొనకపోవడాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని అన్నారు. బీజేపీతో వైసీపీ లాలూచీ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయని అచ్చెన్నాయుడు అన్నారు. పీఏసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశారో జగన్, విజయసాయిరెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు ఓటేశారో కూడా చెప్పాలని మంత్రి నిలదీశారు. ప్రత్యేక ¬దా కోసం కేంద్రంతో తెగదెంపులు చేసుకున్న పార్టీ తెలుగుదేశం అన్నారు. మాకు పదవులు ముఖ్యం కాదని, ఏపీ అభివృద్ధే ముఖ్యమన్నారు. అందుకోసం ఎవరితోనైనా పోట్లాడటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ వైఎస్‌ఆర్‌సీపి మాత్రం కేంద్రప్రభుత్వానికి లోపాయికారిగా మద్దతు ఇస్తూ తమ పార్టీ అధినేత, పార్టీలోని పలువురు నేతలపై ఉన్న కేసులను కొట్టివేయించుకొనేలా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైసీపీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెబుతారనిహెచ్చరించారు.