కేంద్రీయ విద్యాలయం వరం
అనంతపురం,సెప్టెంబర్14(జనంసాక్షి): విభజన హావిూ మేరకు జిల్లాకు కేంద్రీయవిశ్వవిద్యాలయం కేటాయించడం హర్షణీయమని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అన్నారు. ఇది ఓ రకంగా అనంతకు వరం లాంటిదన్నారు. వెనకబడిన అనంతను ఆదుకునేందుకు సిఎంవ చంద్రబాబు దీనిని ఇక్కడే ఏర్పాటుకు ప్రతిపాదించారని అన్నారు. రాష్ట్రవిభజన గాయాలను పూడ్చాలనే ఉద్దేశంతో కేంద్రం జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని గతంలోనే ప్రకటించింది. ఆ మేరకుచర్యలు తీసుకుంటున్నారని అన్నారు. గతేడాది కేంద్ర బృందం జిల్లాలోని పుట్టపర్తి, రాప్తాడు, బుక్కరాయసముద్రం మండలంలో పరిశీలించారు. అప్పట్లోనే బుక్కరాయసముద్రం వద్ద అనుకూలంగా ఉంటుందని పరిశీలన బృందం ఓ అంచనాకు వచ్చింది. మొత్తం 450 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పర్యావరణం, నీరు, విద్యుత్తు, భూమి అనుమతులకు ఇప్పటికే ఆమోదం లభించింది.