కేంద్ర మాజీమంత్రి నోరు మూయించిన కోటిలింగం

 

డోర్నకల్ ఆగస్టు 27 జనం సాక్షి

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ పరిధి యాదవ నగర్ కి చెందిన గంట యకేష్ గత నెలలో రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ ఆ కుటుంబాన్ని పరామర్శించి భౌతిక కాయానికి నివాళులర్పించారు.అనంతరం జిల్లా మెడికల్ కాలేజీ,నూతన కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాల నియామకంలో తెరాస పార్టీ నేతలే చక్రం తిప్పుతున్నారని మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ తీవ్ర ఆరోపణలు చేశారు.అక్కడే ఉన్న తెరాస మున్సిపల్ వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగం కౌంటర్ ఎటాక్ చేశారు.విషాద ఘటనలో రాజకీయాలు చేయడం ఏంటని బలరాం నాయక్ ను ప్రశ్నించారు.ఇకపై తెరాసను విమర్శిస్తే ఊరుకునేది లేదని ఘాటుగా హెచ్చరించారు.కుక్క కాటుకు చెప్పు దెబ్బలు కొట్టినట్టుగానే… ఎవరెన్ని విమర్శలు చేసినా గట్టిగా బధులిస్తామన్నారు.
పరామర్శకు వచ్చి
రాజకీయ ఆరోపణలు
చేయడం ఎంతవరకు సమంజసమన్నారు.ఓ దశలో వాగ్వాదానికి దారితీసింది.
వేదిక తెలియని వ్యక్తి ప్రజా నాయకుడా అని కోటిలింగం ప్రశ్నించారు.దీంతో కంగుతిన్న మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ సంఘటనా స్థలం నుంచి వెళ్ళిపోయారు.