కేఓసి పివో కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా

సింగరేణిలో పెనాల్టీలు రద్దుచేయాలి
* కార్మికుల వేతనాలు పెంచండి

టేకులపల్లి, సెప్టెంబర్ 28( జనం సాక్షి ): సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం కోయగూడెం ఓసి పిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మేనేజర్ సుమన్ కు కార్మికుల పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి పాల్గొని మేనేజర్ కు వివరిస్తూ గత నాలుగు సంవత్సరాలుగా కాంట్రాక్టు కార్మికుల సీఎం పిఎఫ్ లెక్కలు చెప్పడం లేదన్నారు.వెంటనే లెక్కలు చెప్పాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులకు, చట్టం పరంగా రావాల్సిన జాతీయ పండుగ సెలవులకు కాంట్రాక్టు కార్మికులకు మాస్టర్ తో కూడిన సెలవు ఇవ్వడం లేదన్నారు.
కార్మికులు డ్యూటీ కి రాకపోతే, ఆప్ సెంట్ వేయకుండా, పెనాల్టీ వేస్తున్నారని,ఈ పేలాల్టి ఒక రోజుకి 300 రెండవ రోజు 600 మూడవరోజు 900
దీని మూలాన కార్మికుడు మస్టర్ నష్టపోతు తిరిగి పెనాల్టీ చెల్లిస్తున్నాడు. కాంట్రాక్టర్ జీతంలో కట్ చేస్తున్నారని, ఈ పెనాల్టీని రద్దు చేయాలని కోరారు. కార్మికులకు 2016 నుండి ఇప్పటివరకు జీతాలు పెంచలేదన్నారు. సింగరేణిలో కోట్ల రూపాయల ఆదాయానికి ఈ కార్మికులే కారణమని, అలాంటి కార్మికులకు జీతాలు పెంచకపోవడం సిగ్గుచేటు అన్నారు. జీతాలు నెలలో మొదటివారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 30వ తారీఖు నాడు ఇల్లందు జీఎం ఆఫీస్ ముందు ధర్నా ను జయప్రదం చేయాలని కాంట్రాక్టు కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు జరుపుల సుందర్, పాయం వెంకన్న, సైదులు,రామ్ కుమార్, రాజశేఖర్,బి వెంకటేష్,వెంకటనర్సు, ఎం చంద్రశేఖర్, కే నరేష్,బి చంద్రశేఖర్, కే సురేష్, చిన్న రామయ్య తదితరులు పాల్గొన్నారు.