కేటీఆర్ పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి

రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి .

వనపర్తి బ్యూరో సెప్టెంబర్26 (జనంసాక్షి)

సెప్టెంబర్ 29న రాష్ట్ర ఐ టి, పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు వనపర్తి జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి, సంబధిత శాఖల అధికారులతో కలిసి కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కళాశాల, ఐ.టి హబ్, బహిరంగ సభాస్థలి, సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్, సురవరం సాహితీ కళా భవనం లను సందర్శించి చివరి దశలో మిగిలిపోయిన పనులను పరిశీలించారు.
సభాస్థలికి కావలసిన ఏర్పాట్లు, చారిత్రక కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కళాశాల భవనం పునర్నిర్మాణ భవనం, సమీకృత మార్కెట్ భవనం, సురవరం సాహితీ భవనంలో ప్రారంభోత్సవం సందర్భంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల పై కలెక్టర్, ఎస్పీ, అధికారులకు దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 28 ఉదయం వరకు అన్ని నిర్మాణ పనులు పూర్తి అయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి, అడిషనల్ ఎస్పీ ఆనంద్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహా రెడ్డి, మార్కెటింగ్ అధికారి శ్వరన్ సింగ్, పంచాయతీ రాజ్ ఈ. ఈ. మల్లయ్య, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఇంజనీరింగ్ అధికారులు, ఇతర జిల్లా అదికారులు మంత్రి వెంట పాల్గొన్నారు.