కేతకి లో ఘనంగా ఎంపీ బీవీ పాటిల్ జన్మదిన వేడుకలు

ఝరాసంగం నవంబర్ 1 దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఎంపీ బీవీ పాటిల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి హైదరాబాద్ లోని మమత ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మండల తెరాస నాయకులు పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ఎంపీ బీబీ పాటిల్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. అన్ని వర్గాల సంక్షేమానికి ఎంపీ తన వంతు సహకారం అందిస్తున్నారన్నారు. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరి మేలు కోసం కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. ఎంపీ బీబీ పాటిల్ జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రజల సంక్షేమానికి కృత్యాలన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు సభ్యులు షేక్ ఫరీద్ సి డీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, జహీరాబాద్ పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ మోహియోద్దీన్ ఝరాసంగం సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు జాగదీశ్వర్, ఎంపీటీసీ ఆపిజ్, రజిని ప్రియ సంతోష్ పాటిల్, సర్పంచ్ లు బస్వరాజు పాటిల్,పరమేశ్వర్ పాటిల్,ఇందిరమ్మ సత్యనారాయణ రెడ్డి, కృష్ణ,శ్రీనివాస్ రెడ్డి, అమర్షిత్, తెరాస నాయకులు సంగమేశ్వర్ పాటిల్ నర్సిములు, కోహిర్ మండల టి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మ్యాతరి ఆనంద్, దేశెట్టి పాటిల్, నామ రవి కిరణ్,సంజీవ్, నర్సింహ గౌడ్, వెంకటేశం, జహంగీర్, రాములు నేత, మోతిరామ్,, తదితరులు పాల్గొన్నారు.