కేరళకు సాయంలో ముందున్న కెసిఆర్‌

ప్రశంసించిన నారాయణ

విజయవాడ,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): కేరళ రాష్ట్రాకి సాయం అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మెచ్చుకోవాలని సీపీఐ సీనియర్‌ నేత నారాయణ పేర్కొన్నారు. కేరళ వరద బాధితులకు సీపీఐ నేతలు సరుకులు, మందులు, బియ్యం, బట్టలు విరాళాలు సేకరించారు. అయితే… వీటిని కేరళకు ప్రత్యేక వాహనాల్లో పంపారు. ఈ వాహనాలను నారాయణ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ… దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలు కేరళకు సాయం అందించాయన్నారు. అలాగే యూఏఈ వాళ్ల సాయాన్ని అడ్డుకోవడం దారుణమని, కేరళకు సాయం అందించడంలో కేసీఆర్‌ను మెచ్చుకోవాలని అన్నారు. జల విలయంలో అల్లాడిపోయిన కేరళలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. శిబిరాల నుంచి ఇళ్లకు చేరుకుంటున్న బాధితులు ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, వలంటీర్లు వరద బాధితులకు అందిస్తున్న సహాయక కారక్రమాలు కొనసాగుతున్నాయి. కేరళ వరదల్లో 417 మంది ప్రాణాలు కోల్పోగా 8.69 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. చిగురుటాకులా వణికిన కేరళను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వాలు, ప్రజలతోపాటు పలు భాషల చిత్ర పరిశ్రమలు ముందుకొచ్చాయి. నటీనటులు తమవంతు సాయం ప్రకటిస్తూ ఆపన్నులను ఆదుకునే ప్రయత్నం చేశారు. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కేరళకు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. కొన్ని సంస్థలు నిత్యావసర వస్తువులు, దుస్తులు, ఆహార పదార్థాలను పంపించాయి.

 

 

తాజావార్తలు