కేరళలో దారుణఘటన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దహనం
తిరువనంతపురం : ఆ కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా ఆ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కుటుంబంలోని ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటన కేరళలోని దళవపురంలో మంగళవారం తెల్లవారుజామున 1:45 గంటలకు చోటు చేసుకుంది.
ప్రతాపన్(62) అనే తన భార్య శేర్లి(53), అభిరామి(25), అఖిల్(29), నిహుల్, అభిరామి కుమారుడు(8 నెలలు)తో కలిసి ఉంటున్నాడు. కుటుంబాన్ని పోషించేందుకు ప్రతాపన్ కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. అయితే మంగళవారం తెల్లవారుజామున ప్రతాపన్ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఇంట్లో నుంచి దట్టమైన పొగలు బయటకు రావడంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.
ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, నిహుల్ పరిస్థితి విషమంగా ఉంది. ఇంట్లో ఉన్న ఏసీతో పాటు, ఐదు బైక్‌లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.