కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదు
న్యూఢల్లీి,అగస్టు2(జనంసాక్షి): కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తి పాజిటివ్‌గా తేలాడు. దీంతో కేరళలో మంకీపాక్స్ సోకిన వారి సంఖ్య అయిదుకు చేరుకున్నది. ఇక దేశవ్యాప్తంగా ఆ వైరస్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. మంకీపాక్స్ లాంటి లక్షణాలతోనే ఇటీవల ఓ వ్యక్తి కేరళలో మృతిచెందిన విషయం తెలిసిందే. కేరళలో కొత్త మంకీపాక్స్ కేసు నమోదు అయినట్లు మంత్రి వీణా జార్జి తెలిపారు. మల్లప్పురంలో 30 ఏళ్ల పేషెంట్ చికిత్స తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. జూలై 27వ తేదీన యూఏఈ నుంచి అతను కోజికోడ్ వచ్చాడు. మంజేరీ మెడికల్ కాలేజీలో అతను చికిత్స పొందుతున్నాడు. ఇటీవల మంకీపాక్స్ లక్షణాలతో మరణించిన కేసులో త్రిసూర్ జిల్లాలో 20 మందిని క్వారెంటైన్ చేశారు.