కేరళ మంత్రిగా జయరాజన్‌ ప్రమాణం

తిరువనంతపురం,ఆగస్ట్‌14( జ‌నం సాక్షి ): సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఇ.పి.జయరాజన్‌ మంగళవారం పినరయ్‌ విజయన్‌ క్యాబినేట్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేరళలోని రాజ్‌భనవన్‌లో గవర్నర్‌ పి.సదాశివం జయరాజన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. మట్టన్నూర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జయరాజన్‌ను కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌, మంత్రులు, ఎల్డీఎఫ్‌ శాసనసభ్యులు, సిపిఎం రాష్ట్ర క్యారద్శి కొడియేరీ బాలకృష్ణన్‌, ప్రధాన కార్యదర్శి టోమ్‌ జోసెఫ్‌, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతిపక్ష యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(యుడిఎఫ్‌) సభ్యులెవరు కార్యక్రమానికి హాజరుకాలేదు. జయరాజన్‌ ప్రవేశంతో క్యాబినేట్‌ సంఖ్య 20కి పెరిగింది. అంతకు ముందు కీడ్రా, పారిశ్రామిక మంత్రిగా వ్యవహిరంచిన ఆయన బంధు ప్రీతి, స్వలాభాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదురుకావడంతో 2016లో పదవికి రాజీనామా చేశారు. అనంతరం విజిలెన్స్‌, అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. ఆయనపై నమోదైన చార్జీషీట్‌ను గత ఏడాది సెప్టెబంర్‌లో హైకోర్టు కొట్టివేసింది.