కేసీఆర్‌తో విభేదాలు లేవు : విజయశాంతి
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని మెదక్ ఎంపీ విజయశాంతి అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ అనారోగ్యం కారణంగానే సూర్యపేట సభకు హాజరుకాలేకపోయానని చెప్పారు. దీన్ని మీడియా వక్రీకరించడం తగదని సూచించారు. అందుకే బహిరంగసభకు హాజరుకాలేకపోయినట్లు పేర్కొన్నారు. కేసీఆర్‌కు తనకూ మధ్య విభేదాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం లేదన్నారు. తాను టీఆర్‌ఎస్ కార్యకర్తగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. మీడియా ఏవేవో కథనాలు సృష్టిస్తూ అనవసరంగా నిందలు వేస్తున్నారని అన్నారు. ఎప్పటికీ టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని చెప్పారు. ఇకపై ఇలాంటి తప్పుడు కథనాలు రాయరాదని సూచించారు.