కేసీఆర్‌ను విమర్శిస్తే ఊరుకోం : నాగం జనార్దన్‌రెడ్డి

మెదక్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును సీమాంధ్ర నేతలు విమర్శిస్తే ఊరుకోమని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు. ఇవాళ ఆయన మెదక్‌లో ‘ భరోసా యాత్ర’లో మాట్లాడారు. తెలంగాణ కోసం అన్ని పార్టీలు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.