కేసీఆర్‌ చైనా పర్యటన రాచరికాన్ని గుర్తు చేస్తోంది : పొన్నం

కరీంనగర్‌, సెప్టెంబరు 8 : కేసీఆర్‌ చైనా పర్యటన రాచరికాన్ని గుర్తు చేస్తోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్‌ చైనా పర్యటనకు వెళ్లడమేంటి ? అని ఆయన ప్రశ్నించారు. చైనా పర్యటన కోసం రూ.2.5 కోట్లతో ప్రత్యేక విమానంలో వెళ్లారన్నారు. చైనా మార్కెట్‌ కుదేలైన నేపథ్యంలో పెట్టుబడులు తెస్తామనడం మూర్ఖత్వం అని ఆయన ఆరోపించారు.