‘కేసీఆర్ తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేసిండు’ హారీష్‌రావు
మెదక్: తెలంగాణ ఉద్యమ రథసారధి కల్వకుంట్ల చంద్రశేకర్‌రావు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకే ఆమరణ నిరాహాన దీక్ష చేశాడని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఇవాళ ఆయన సిద్దిపేటలో ఏర్పాటు చేసిన తెలంగాణ దీక్షా దివస్‌లో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును తెలంగాణ ప్రజలు నమ్మకపోవడం వల్లనే ఆయన తెలంగాణ ఉద్యమ అధిపతి కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారని తెలియజేశారు.
బాబు నిరాహార దీక్ష చేస్తారా?
తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేశారని, ఆదే తెలంగాణ సాథన కోసం బాబు నిరాహార దీక్ష చేస్తారా అని హరీష్‌రావు ప్రశ్నించారు. బాబుకు అధికార దాహమని, అధికార సాధన కోసమే ఆయన పాదయాత్రలు చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేసింది. టీఆర్‌ఎస& ఎస్సేనని ఆయన వివరించారు. తెలంగాణ ఉద్యమ ఫలితంగానే తెలంగాణలోని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు పదవులు సంపాదించ గలుగుతున్నారని తెలియజేశారు. పొరపాటున కూడా టీడీపీ అధికారంలోకి రాదని, వస్తే ఒక బీసీని సీఎం చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ఆయన నిలదీశారు.