కేసీఆర్‌ వైఖరి వల్లే తెలంగాణవాదం చులకనవుతోంది

కరీంనగర్‌సిటీ, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) :
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వైఖరి వల్లే కాంగ్రెస్‌ దృష్టిలో తెలంగాణ వాదం చులకనవుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయ ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆది వారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ బతి కి ఉంటే కేసీఆర్‌ వైఖరి చూసి ఆత్మ హత్య చేసుకునేవారని అన్నారు. తె లంగాణ ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడిన పార్టీ ఓట్లు సీట్లు రాజకీయాలకు పాల్పడటం సరికాదన్నారు. పక్కా రాజకీయ పార్టీగా ఉద్యమ పార్టీలను మలచాలని, అందుకు ప్రజల ఆకాంక్షను వాడుకోవాలని చూడటం అప్రజాస్వామికమన్నారు.తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి మోసం చేస్తోందని అన్నారు. ఇన్నా ళ్లు ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఏఐ సీసీ అధినేత్రి సోనియాగాంధీ తెలం గాణ సమస్య పరిష్కరిస్తారని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇ ప్పుడు రాహుల్‌ ఆ సమస్యకు పరి ష్కారం చూపుతారని చెప్పడం విడ్డూ రంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ ద్వం ద్వ వైఖరి, అసమర్థ విధానాలతో రాష్ట్రం వల్లకాడు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఓదార్పునిచ్చే వారే కరువయ్యారని, ప్రకృతి వైపరీత్యాలు, ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన ధరలతో కోలోకోలేని విధంగా రైతన్నలు చితికి పోయారని, ఈ నేపథ్యంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నా పాలకుల్లో చలనం కరువైందన్నారు. పక్కా సమైక్యవాది అయిన కిరణ్‌ తెలంగాణపై ఏదో ఒకటి తేల్చాలని కోరడం వెనుక ఏదో ఆంతర్యం దాగి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 20, 21 తేదీల్లో ప్రజాచైతన్యం ఉద్యమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్దసంఖ్యలో ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.