కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు జిల్లా వ్యాప్తంగా 336 మంది డి ఆర్ డి ఓ కార్యాలయం రిపోర్ట్ చేసి జాయిన్ కావడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శంకర్, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కంకల సిద్దిరాజు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై తొమ్మిది నెలల నుండి విధుల నుండి పక్కన పెట్టిన ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్యా గత మూడు నెలల క్రితం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి వీధిలో తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఈరోజు వీధుల్లో శుభ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయం ముందు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఫీల్డ్ అసిస్టెంట్లు చాంద్ పాషా, బైరగోని రమేష్ ,సుధాకర్, వాణి, భాగ్యలక్ష్మి, సునీత, తదితరులు పాల్గొన్నారు.