కేసుల మాఫీ కోసమే బిజెపితో దోస్తీ

జగన్‌ తీరుపై మండిపడ్డ మంత్రి అచ్చెన్న

శ్రీకాకుళం,జూలై27(జ‌నం సాక్షి): కేసుల మాఫీ కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి బీజేపీతో అంటకాగుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. అవగాహన లేనివాళ్ళు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ బీజేపీ, వైసీపీలు తప్ప దేశంలోని అన్నిపార్టీలు ఏపీకి జరిగిన అన్యాయాన్ని గుర్తించాయన్నారు. ఏపీలో బీజేపీ తాడు, బొంగరం లేని పార్టీ అని, 2014లో కాంగ్రెస్‌కు పట్టినగతే బీజేపీకి పడుతుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.అధికారం ఎండమావిలా కనిపిస్తుండటం, పాదయాత్రకు ఆదరణ లేకపోవడంతో ఫ్రస్టేష్రన్‌కు గురై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ తనకు తాను గొప్ప వ్యక్తిగా ఊహించుకొని ప్రతివాళ్ళనూ ఏదంటే అది ఎలా మాట్లాడతారు?’ అని మంత్రి విమర్శించారు. ఆంధ్రులకు అన్యాయం చేసిన బీజేపీ 2019 ఎన్నికల్లో నామరూపాలు లేకుండా పోతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కొంతమంది టీడీపీ నాయకులను వైసీపీలో చేర్చుకోవాలని కలలు కంటున్నారని, అయితే జగన్‌ ప్రయత్నాలు ఫలించవన్నారు. ప్రత్యేక ¬దా ఇచ్చే వరకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని మంత్రి ఉద్ఘాటించారు. చేతల్లో కాకుండా నోరు పారేసుకోవడంలో మాత్రమే జగన్‌ దిట్ట అని మరోసారి రుజువైందన్నారు. వైసీపీ కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడటంతో రాష్ట్రం మరింతగా నష్టపోతోందని విమర్శించారు.

 

తాజావార్తలు