కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి తరానికి ఆదర్శం

కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి తరానికి ఆదర్శం

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్: దేశ స్వాతంత్ర్యోద్యమంలో, తెలంగాణ తొలి,మలి దశ ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం నాటి,నేటి తరానికి ఎంతో ఆదర్శమని హుజూర్ నగర్ నియోజక వర్గ పద్మశాలి సంఘం అధ్యక్షుడు, గ్రంథాలయం చైర్మన్ గుర్రం మార్కండేయ అన్నారు. బుధవారం కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షుడు పిల్లలమర్రి పుల్లారావు,ప్రధాన కార్యదర్శి యరమాద గిరి అధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ముషం నరసింహ,చెరుకుపల్లి నరసింహ, రాష్ట్ర మహిళా నాయకురాలు నక్క రమాదేవి, ఉపాధ్యక్షుడు నక్క గిరి, ప్రచార కార్యదర్శి రావిరాల యుగంధర్, పద్మశాలి సంఘ నాయకులు చిలువేరు సోమశేఖర్, ఎరమాద శేఖర్, మేకల వెంకటేష్, రెబ్బా సత్య నారాయణ,నక్క శ్రీను, చిలుకూరు ఉపేందర్, చిట్టి పొలు ఉపేందర్,గూడూరు చంద్రం, ఏలే శివ, బాలేన నరసింహా రావు తదితరులు పాల్గొన్నారు.