కొడకండ్లలో పద్మశాలి ఐక్యవేదిక సమావేశం

కొడకండ్ల,అక్టోబర్23( జనంసాక్షి )
కొడకండ్ల మండల కేంద్రంలో మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ పద్మశాలి ఐక్యవేదిక సమావేశం నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు పసునూరి మధుసూధన్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి దయాకర్ రావు ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై 5 శాతం పన్ను విధిస్తున్నారు, పన్ను విధించకుండ ఉండాలని రాష్ట్ర టెక్స్ టైల్స్ మంత్రి కే.టి.రామారావు పోస్ట్ కార్డ్ వ్రాయడం జరిగినది.అలాగె ప్రతి పద్మశాలి సభ్యులు ప్రధానమంత్రికి పోస్టు కార్డ్ వ్రాసి నేత కార్మికులకు సహకరించాలని కోరడం జరిగింది.మరమగ్గ కార్మికులను చేనేత కార్మికులుగా గుర్తిచాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో
ముఖ్య అతిథిదులుగా యం.పి.పి.జ్యోతి రవీంద్ర నాయక్,జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యులు సిందే రామోజీ,
జిల్లా సంఘం అధ్యక్షులు వేముల బాలరాజు,పద్మశాలి సంఘం అధ్యక్షులు పసునూరి నవీన్,సంఘం ప్రధాన కార్యదర్శి దోర్ణం ప్రభాకర్,శ్రీనివాస సొసైటీ అధ్యక్షులు రమేష్ ,సంఘం మాజీ అధ్యక్షులుమసురం వెంకటనారాయణ,రామన్న గూడెం సంఘం అధ్యక్షులు భారతశ్రీనివాసు, యాదగిరి,కో ఆప్షన్స్ మెంబర్ నజీర్, తదితరులు పాల్గొన్నారు.