కొడుకు మృతిని తట్టుకోలేక తండ్రి మృతి
కరీంనగర్, మార్చి 29 : కుమారుడి మృతిని తట్టుకోలేక ఓ తండ్రి గుండె ఆగింది. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా చెదురుమామిడి మండలం బొమ్మనపల్లిలో చోటుచేసుకుంది. కుమారుడు చనిపోవడాన్ని జీర్ణించుకోలేని తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. తండ్రీకొడుకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.