కొత్తగా 13 వేల 737 కరోనా కేసులు నమోదు
న్యూఢల్లీి,అగస్టు2(జనంసాక్షి):దేశంలో కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 13 వేల 737 మందికి వైరస్ సోకగా.. మరో 34 మంది చనిపోయారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గగా.. మరణాలు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 17 వేల 897 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.49 శాతానికి పెరిగింది. దేశంలో ప్రస్తుతం లక్షా 39 వేల 792 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకు 204.6 కోట్లకు పైగా టీకా డోసులను కేంద్రం పంపిణీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల 21 వేల 965 కొత్త కేసులు రాగా… వెయ్యి 259 మంది మరణించారు. జపాన్ లో లక్షకు పైగా కేసులు రాగా.. 78 మంది చనిపోయారు. అమెరికాలో కొత్తగా 54 వేలకు పైగా కేసులు రాగా.. 149 మంది ప్రాణాలు కోల్పోయారు.