కొత్తగూడ గంగారం మండలాలకు పెద్దదిక్కుగా నేనుంటా:రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి

కొత్తగూడ గంగారం మండలాలకు పెద్దదిక్కుగా నేనుంటా:రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి

కొత్తగూడ జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని బత్తులపల్లి గ్రామంలో మండల బిఆర్ఎస్ అధ్యక్షులు వేణు,అధికార ప్రతినిధి నెహ్రూ ఆధ్వర్యంలో బత్తులపల్లి సర్పంచ్,జిల్లా నాయకులు ఈసం కాంతమ్మ స్వామి సొసైటీ డైరెక్టర్ కమలమ్మ ఆతిథ్యం లో ఘనంగా బారాస కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ములుగు భారసా అభ్యర్థి బడే నాగజ్యోతి,ముఖ్యఅతిథిగా బారాస ములుగు ఎన్నికల ఇంచార్జ్ రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి,ములుగు గ్రంథాలయం చైర్మన్ గోవింద నాయక్ పాల్గొనడం జరిగింది.అనంతరం రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగూడ గంగారం మండలాలకు ఎలాంటి సమస్య వచ్చిన పెద్దదిక్కుల నేను ఉంటానని త్వరలోనే మీకు పాకాల నుండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు.మంత్రి హరీష్ రావు తో ములుగు లోని పలు సమస్యలపై చర్చించడంలో కొత్తగూడ,గంగారం మండలాల పై ప్రత్యేక చర్చ జరిగిందని అన్నారు.కొత్తగూడ గంగారం మండలాలలు అభివృద్ధికి నోచుకోలేదని చెప్పడంతో ఎలాంటి సమస్యలు ఉన్న తీరుస్తానని హామీ ఇవ్వడం జరిగిందని అందులో భాగంగానే సాగునీటి సమస్య తీరుస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగిందని అన్నారు.ఏజెన్సీ మండలంలో 50 పడకల ఆసుపత్రి పై మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లి ఆసుపత్రిని సైతం వచ్చే విధంగా నా సాయ శక్తుల పని చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.రోడ్ల విషయంలో సైతం ప్రత్యేక దృష్టి పెట్టి రోడ్లు మొత్తం పూర్తయ్యాలా కృషి చేస్తానని అన్నారు.గతంలో జరిగిన ఎన్నికల్లో బారాస అభ్యర్థిని గెలిపించుకోకపోవడం తో ములుగు నియోజకవర్గం తో పాటు ముఖ్యంగా కొత్తగూడ గంగారం మండలాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని గుర్తు చేశారు.రైతులందరూ ప్రతి ఒక్కరు కరెంటు కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రతి రైతుకు కరెంటు,బోర్లు పంట పొలాలకు నడుచుకుంటూ వస్తాయని అంతేకాకుండా విద్యుత్ లేనిపక్షంలో సోలార్ తో సైతం బోర్లు నడిచే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.ములుగు అభ్యర్థి బడే నాగజ్యోతిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి కార్యకర్త సైనికుల పని చేయాలని కోరారు.అనంతరం బడే నాగజ్యోతి మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని కేసీఆర్ తోనే ములుగు నియోజకవర్గం అభివృద్ధి అవుతుందని పోడు పట్టాల విషయంలో గతంలో పాలించిన పార్టీలు భయపడిన కానీ కేసీఆర్ ఎంతో ధైర్యం చేసి ప్రతి రైతుకు పొడు పట్టాలు అందే విధంగా కృషి చేసిన ఘనత కేసిఆర్ కు చెందుతుంది.ములుగు నియోజకవర్గం నుండి బారాసా అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చింది.ఒక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపించినట్లయితే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా….ఎంతో మందిని మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించారు.కానీ నాకు మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గుర్తించి నిరుపేద కుటుంబం పేద ప్రజల కోసమే ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం నుండి వచ్చిన బిడ్డను….మీ యొక్క ఓటు హక్కు తో ఎంతో మంది గెలుపొందారు.నాకు ఒక్క అవకాశం ఇచ్చినట్లయితే ములుగు నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడ గంగారం మండలాలకు ఎలాంటి సమస్య వచ్చిన ముందుండి పోరాడుతా…అభివృద్ధికి అవసరమైన పనులన్నీ తెచ్చుకుంటా అని అన్నారు.రోడ్ల సమస్యను,సాగునీటి సమస్యపై ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి వివరించడం జరిగిందని అన్నారు.అదేవిధంగా గిరిజనేతర భూములపై హక్కులు కల్పించడంలో ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని అన్నారు.విస్తృత సాయి సమావేశానికి ఆతిథ్యం అందించిన ఈసం స్వామి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొత్తగూడ గంగారం మండల అధ్యక్షులు కార్యదర్శులు సర్పంచులు ఎంపిటిసిలు కార్యకర్తలు పాల్గొన్నారు