కొత్తది వద్దు.. పాతది ముద్దు..
– మండలాధ్యక్షుడు సీతారాములు
డోర్నకల్ సెప్టెంబర్ 1 జనం సాక్షి
నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతిని అమలు చేయాలని పిఆర్టియు మండలాధ్యక్షుడు వెంపటి సీతారాములు డిమాండ్ చేశారు. గురువారం భోజన విరామ సమయంలో టిఆర్టియుటీఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి పెన్షన్ విద్రోహ దినంగా పాటించారు.అనంతరం ప్రదర్శనగా వెళ్లి తాసిల్దార్ వివేక్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పెన్షన్ బిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు అని పునర్గాటించారు.నూతన పెన్షన్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు.పెన్షన్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వినోద్, రాష్ట్ర బాద్యులు చాగర్లమూడి శ్రీధర్, ప్రభుదాస్, బాలాజీ, ఆంగోతు రమేష్, జిల్లా బాద్యులు నవీన్, భాస్కర్, అరుణాబాయి, మండల బాధ్యులు సంజీవరావు, రుద్ర. రమేష్, సారంగం, శేషదీపిక, శ్రీనివాస్,డీ.రమేష్, సుధాకర్,వినేష్,రజని రామరాజు,షాజహాన్,రవికుమార్,వీ రన్న,డేవిడ్ రాజ్,రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.