కొత్తసాగుచట్టాల రద్దును స్వాగతించిన రాహుల్‌

కేంద్ర అహంకారాన్ని ఓడిరచారని రైతులకు అభినందనరైతులను అభినందించిన మమతా బెనర్జీ

న్యూఢల్లీి,నవంబర్‌19(జనం సాక్షి  )

కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. రైతులు చేపట్టిన సత్యాగ్రహం.. కేంద్ర ప్రభుత్వ అహంకారాన్ని ఓడిరచినట్లు రాహుల్‌ విమర్శించారు. ఏడాది కాలం నుంచి దేశవ్యాప్తంగా రైతులు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఆ ఆందోళనల్లో వందల సంఖ్యలో అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు మోదీ ప్రకటన చేసిన తర్వాత.. రాహుల్‌ గాంధీ తన ట్విట్టర్‌లో రియాక్ట్‌ అయ్యారు. దేశ రైతులు తమ సత్యాగ్రహ దీక్షతో.. కేంద్ర సర్కార్‌ అహంకారాన్ని తలదించుకునేలా చేశారన్నారు. ఇది అన్యాయంపై విజయమని, ఈ సందర్భరంగా రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. జై హింద్‌, జై కిసాన్‌ అంటూ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన పాత వీడియోను కూడా తన ట్విట్టర్‌లో రాహుల్‌ షేర్‌ చేశారు. రైతు చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా చేస్తామని, తన మాటాలను గుర్తుపెట్టుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను రాహుల్‌ పోస్టు చేశారు. దేశంలో కేంద్రం తీసుకువచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు నిర్ణయంపై పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతోషం వ్యక్తం చేశారు.అహంకారం ఓడిపోయింది, అన్యాయానికి వ్యతిరేకంగా రైతులు పోరాడి విజయం సాధించినందుకు అభినందనలని అన్నారు.  వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ రైతులకు అభినందనలు తెలిపారు. విూ పట్ల ప్రవర్తించిన క్రూరత్వానికి చలించకుండా అవిశ్రాంతంగా పోరాడిన ప్రతి ఒక్క రైతుకు నా హృదయపూర్వక అభినందనలు. ఇది విూ విజయం.. ఈ పోరాటంలో మరణించిన రైతుల నా ప్రగాఢ సానుభూతి‘ అని మమతాబెనర్జీ ట్వీట్‌ చేశారు. మొత్తంవిూద సాగు చట్టాల రద్దుపై దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలు సంతోషం వ్యక్తం చేస్తూ రైతులను అభినందించారు.