కొనసాగుతున్న అల్పపీడనం

అప్రమత్తం అయిన అధికారగణం
విశాకపట్టణం, డిసెంబరు13(జ‌నంసాక్షి): గ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారానికి తీవ్ర వాయుగుండంగా బలపడి 15న దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు దిశగా రానుంది. ఇది తీరం వైపు వచ్చే సమయంలో దక్షిణ కోస్తాలో బలమైన గాలులతో పాటు అలలు ఎగసిపడే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం ప్రభావంతో ఈనెల 14నుంచి దక్షిణ కోస్తాలో వర్షాలు ప్రారంభమవుతాయి. 15, 16 తేదీల్లో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి. కాగా, ఈనెల 14నుంచి 16వరకు కోస్తా జిల్లాలపై వాయుగుండం ప్రభావం చూపుతుందని ఆర్‌టీజీఎస్‌ విభాగం హెచ్చరించింది. కోస్తాంధ్ర తీరానికి వాయుగుండం ముప్పు పొంచి ఉన్నందున అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని, కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో రైతులకు అండగా నిలవాలని సూచించారు.