కొనసాగుతున్న ఆపరేషన్ గంగ
రొమేనియా, హంగేరికి రెండు ఐఏఎఫ్ విమానాలు
24 గంటల్లో ఆరు విమానాల రాక
బాధితులకు స్వల్ప ఆహార పదార్థాలు పంపిణీ
టెంట్లు, దుప్పట్లు కూడా పంపించిన భారత ప్రభుత్వం
న్యూఢల్లీి,మార్చి2(జనం సాక్షి) ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం భారత వైమానిక దళానికి (ఐఏఏఫ్) చెందిన విమానాలను రంగంలోకి దింపింది. హిండాన్ ఎయిర్ బేస్ నుంచి రొమేనియా, హంగేరికి రెండు ఐఏఎఫ్ విమానాలు బుధవారం ఉదయం బయలుదేరి వెళ్లాయి. ఏసీ`17 గ్లోబ్‌మాస్టర్ విమానం తెల్లవారుజామున 4 గంటలకు రొమేనియా బయలు దేరింది. ఉక్రెయిన్‌లో మానవ సహాయ చర్యలకు అవసరమైన సామగ్రిని కూడా ఇందులో పంపించారు. తిరుగు ప్రయాణంలో అక్కడి భారత విద్యార్థులను తీసుకురానున్నారు. ఈ రవాణా విమానం ద్వారా 300 మంది విద్యార్థులను ఒకేసారి తరలించవచ్చు. గడిచిన 24 గంటల్లో ఉక్రెయిన్ నుండి 1,377 మంది భారతీయులను తరలించినట్లు విదేశాంగ వ్యవహారాల మంత్రి జై శంకర్ బుధవారం తెలిపారు. గత 24 గంటల్లో ఆరు విమానాలు భారత్‌కు బయలుదేరాయని అన్నారు. మొదటి విమానం పోలాండ్ నుండి మొదటి విమానం టేకాఫ్ అయ్యిందని, మొత్తం 1377 మంది భారతీయులను తరలించినట్లు ఆయన ట్విటర్‌లో తెలిపారు. దీనిలో భాగంగా రెండు మూడురోజుల్లో మరో 26 విమానాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడంతో పశ్చిమ సరిహద్దులో ఉన్న రొమేనియా, హంగేరి, పోలాండ్, స్లోవాక్ రిపబ్లిక్ దేశాల విమానాశ్రయాలను వినియోగించుకుంటున్నట్లు వెల్లడిరచారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో భారతీయులెవరూ మిగలలేదని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ప్రింగ్లా తెలిపారు. ’ఆపరేషన్ గంగ’ పేరుతో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన పలువురు భారతీయ విద్యార్థులు, పౌరులను కేంద్రం తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లోని భారతీయుల కోసం వాయుసేన విమానాల్లో టెంట్లు, బ్లాంకెట్లను పంపిస్తున్నారు.
భారతీయులను తరలించేందుకు ఆపరేషన్ గంగాలో భాగంగా.. వాయుసేనకు చెందిన మరో మూడు రవాణా విమానాలు పోలండ్, హంగెరీ, రొమేనియాకు బుధవారం వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే సీ`17 గ్లోబ్‌మాస్టర్ ఎయిర్‌క్రాప్ట్ బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు పలు సామగ్రితో బయలుదేరి వెళ్లింది. వాయుసేన విమానాల్లో టెంట్లు, బ్లాంకెట్ల వంటి ఇతర సామగ్రిని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మూడు విమానాలు హిందోన్ ఎయిర్‌బేస్ నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అలాగే క్రెయిన్‌లో చిక్కుకున్న ప్రజలకు భారతీయల కోసం నవ్కిూన్ మూంగ్ దాల్, ఆలూ భుజియా.. పంపిస్తున్నామని అన్నారు. పోలాండ్ విూదుగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం మంగళవారం ఔషధాలు , ఇతర సహాయక సామగ్రిని మొదటి సరుకును పంపింది కేంద్ర ప్రభుత్వం. మందులే కాకుండా ఆహార పదార్థాలు కూడా పంపించారు. వైమానిక దళం అ`17 విమానం పంపిన వస్తువులలో నవ్కిూన్ మూంగ్ దాల్, బంగాళాదుంప భుజియా కూడా ఉంది. రష్యా` ఉక్రెయిన్ యుద్ధం వల్ల లక్షలాదిమంది నిరాశ్రయులవుతున్నారు. వేలాదిమంది మరణిస్తున్నారు. వేలాదిమంది భారతీయ విద్యార్ధులు రష్యా సరిహద్దుల్లో చిక్కుకుని పోయారు. తూర్పు ఉక్రేయిన్ లోని సువిూ పట్టణంలో 500 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. రష్యా సరిహద్దులకు కేవలం రెండు గంటల్లో చేరుకునే
దూరంలో ఉంది సువిూ పట్టణం. వెనువెంటనే తమను రష్యా గుండా స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వాన్ని విద్యార్థులు వేడుకుంటున్నారు. ఉక్రెయిన్ పశ్చిమ వైపునకు వెళ్లడానికి 20 గంటల ప్రయాణం చేయాల్సి ఉంది. ప్రస్తుత అననుకూల పరిస్థితుల్లో భారతీయ విద్యార్థులకు అలా ప్రయాణం చేయడం అసాధ్యం. అది క్షేమకరం కూడా కాదంటున్నారు. రష్యా క్షిపణి దాడుల్లో ధ్వంసమైన రైల్వే ట్రాకులు, లాండు మైన్లతో నిండి ఉన్న రహదారుల పై ప్రయాణం ప్రాణాంతకం. కనీసం రాజధాని కివీ వరకు ఇదే పరిస్థితి వుంది. భయంతో బిక్కుబిక్కు మంటూ సహాయం కోసం భారతీయ విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. ఉక్రెయిన్ పొరుగు దేశాలకు చేరుకున్న భారతీయ విద్యార్థులు, పౌరులను స్వదేశానికి వేగంగా తరలించేందుకు భారత ప్రభుత్వం ముమ్మర సన్నాహాలు చేసింది. ఆపరేషన్ గంగాలో భాగంగా ప్రత్యేక విమానాలు నడుపుతోంది. వచ్చే మూడు రోజులలో మొత్తం 26 విమానాలను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.