కొనసాగుతున్న రిలే దీక్షలు

ఆదిలాబాద్‌ ,జూలై 20 : ప్రత్యేక రాష్ట్ర విషయాన్ని అగస్టులోగా తేల్చకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారంనాటికి 929వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ విషయమై కేంద్రం రోజు ఒక మాట మాట్లాడుతూ కాలయాపన చేస్తుండగా కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ప్రత్యేక రాష్ట్ర విషయమై కేంద్రం ప్రకటన చేస్తుందని చెప్పడం జరిగిందని అన్నారు. ప్రజల అకాంక్ష మేరకు, కేంద్ర, కాంగ్రెస్‌ నేతలు ప్రకటించిన విధంగా అగస్టు మాసంలో స్పష్టమైన ప్రకటన చేయకపోతే తగిన మూల్యం చెల్లించకతప్పదని వారు హెచ్చరించారు.