కొబ్బరిపీచు పరిశ్రమలకు ప్రోత్సాహం

విజయనగరం,నవంబర్‌29(జ‌నంసాక్షి): రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా కొబ్బరి పీచు ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో నిలవగా ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయి.ఈ పరిశ్రమలో 70వేల మందికి ఉపాధి దొరుకుతోందన్నారు.  మరిన్ని పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహిస్తున్నారు.  కొబ్బరి పీచు ఆధారంగా రాష్ట్రంలో ఏర్పాటైన 900 పరిశ్రమలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని కొబ్బరి పీచు ఉత్పత్తుల సంస్థ ప్రాంతీయ అధికారి ఎం.రామచంద్రరావు అన్నారు.  తమ్మయ్యపాలెం గ్రామంలోకొబ్బరి పీచు ఉత్పత్తులపై ఔత్సాహికులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొబ్బరి పీచు పరిశ్రమల ద్వారా రూ.120కోట్లు విలువైన ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నట్లు తెలిపారు. ఈ పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకొచ్చే ఔత్సాహికులకు రూ.2లక్షల నుంచి రూ.10కోట్ల వరకూ రుణం సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు.