కొమరంభీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

కరీంనగర్ (జ‌నంసాక్షి) :  కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా రాయికల్లో కొమరంభీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఆడిటోరియం, ఎడ్యుకేషన్ ట్రస్ట్ భవనానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, కేంద్ర మంత్రి ఓరమ్, చినజీయర్స్వామి, మంత్రి చందూలాల్, ఎంపీ కవిత, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్రావు, సోమారపు, శోభ, రసమయి తదితరులు పాల్గొన్నారు.