కొమరం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రేగా కాంతారావు
పినపాక నియోజకవర్గం ఆగష్టు 09 ( జనం సాక్షి): ఆదివాసులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని సాంబాయి గూడెం గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై ఆదివాసి జెండా ను ఆవిష్కరించి, నూతనంగా ఏర్పాటుచేసిన కొమరం భీం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెడుతుందన్నారు, గిరిజన ఆవాసాలు అన్నిటికి త్రి ఫేస్ కరెంటు రోడ్ల వసతి , గురుకులాల ద్వారా నాణ్యమైన విద్య మంచి భోజనం వసతి సౌకర్యాలు కల్పిస్తోంది. ఆదివాసుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం నరసింహారావు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, కార్యదర్శులు, మహిళలు ఆదివాసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.