కొర్రవిూను విత్తనోత్పత్తికిశ్రీకారం

ఖమ్మం,జూలై7(జనంసాక్షి)): కొర్రవిూను చేపపిల్లల విత్తనోత్పత్తికి వైరాలోని చేపపిల్లల విత్తనోత్పత్తి కేంద్రంలో శ్రీకారం చుట్టారు. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌ కేంద్రానికి చెందిన సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్రెష్‌వాటర్‌ ఆక్వాకల్చర్‌ తో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇక్కడ కొర్రవిూను చేపపిల్లల ఉత్పత్తిని చేపట్టారు. 018 ఆగస్టులో ఇక్కడ కొర్రవిూను చేపపిల్లల ఉత్పత్తి పక్రియను ప్రారంభించగా.. అనేక ఆటంకాలతో మూడేళ్లుగా ప్రణాళిక ముందుకు సాగలేదు. ప్రస్తుతం అన్ని రకాలుగా అనుకూలిస్తుండటంతో మళ్లీ రెండోసారి కొర్రవిూను పిల్లల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు.రాష్ట్రం మొత్తంవిూద వైరా విత్తనోత్పత్తి కేంద్రాన్ని ఎంపిక చేసింది. ఇక్కడ నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో వైరాలో కొర్రవిూను చేపపిల్లలు
ఉత్పత్తి చేసి ఫలితాలు సాధించిన తర్వాత రాష్ట్రంలో మరికొన్ని చోట్ల ఆ పక్రియ చేపట్టి చెరువుల్లో ఆపిల్లలు సరఫరా చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వైరా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి బుజ్జిబాబు ఆధ్వర్యంలో 800గ్రాముల నుంచి 1100గ్రాముల బరువున్న కొర్రవిూను చేపపిల్లలను సేకరించి వాటి ద్వారా పిల్లల ఉత్పత్తి పక్రియ చేపట్టారు. నెలరోజుల నుంచి కొర్రవిూను చేపలకు జీవించి ఉన్న చిరుచేపలను ఆహారంగా అందిస్తున్నారు.