కొలువుల జాతర
తెలంగాణలో ఇక ఉద్యోగాల జాతర
భారీగా ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రకటన
80,039 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ
ఇకనుంచి కాంట్రాక్ పోస్టులకు చెల్లచీటీ
ఇక ఏటా ఉద్యోగ క్యాలెండర్ ఉంటుందని స్పష్టీకరణ
ఉద్యోగార్థుల వయోపరిమిత పదేళ్లు సడలింపు
నీళ్లు నియామకాలు తదితర అంశాలపై వివరణ
యూనివర్సిటీల్లో భారీగా నియామకాలు
4794 టీచింగ్,నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ
స్థానిక రిజర్వేషన్ల ఆధారంగా ఉద్యోగాల భర్తీ
గ్రూప్ పోస్టులకు కూడా నోటిఫికేషన్లుజోనల్, మల్టీ జోనలు పోస్టులకు కూడా నోటిఫికేషన్
ఇకనుంచి పక్కాగా లోకల్ రిజర్వేషన్లు
ఎక్కడి వారికి అక్కడే ఉద్యోగాల కల్పన
రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక రిజర్వేషన్లు
అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్,మార్చి 9(జనంసాక్షి): నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీపి కబురు అందించారు. ఎంతోకాలంగా ఆశపెడుతూ వచ్చి ఉద్యోగాలకు సంబంధించి ఎట్టకేలకు ప్రకటన చేశారు. అసెంబ్లీ వేదికగా భారీ ఉద్యోగ ప్రకటన చేశారు. ఉద్యోగార్థులకు ఆనందం నింపారు. ఉద్యోగ వయోపరి మితిని సడలించడంతో పాటు,కాంట్రాక్ట్ కార్మికులను రెగగ్యులరైజ్ చేస్తూ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 80,039 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగగా ప్రకటించారు. ఇకముందు తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగగాలు ఉండవని ప్రకటించారు. అలాగే ఏటా ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని అన్నారు.వనపర్తి పర్యటనలో చెప్పినట్లుగా అంతా టివిల ముందు కూర్చుని చూసేలా ఉద్యోగాలపై సుదీర్ఘ ప్రకటన చేశారు. అలాగే తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, ఉమ్మడి ఎపిలో ఎదుర్కొన్న అనుభవాలు, 9,10 షెడ్యూల్,ముల్కీ రూల్స్, రాష్ట్రపతి ఉత్తర్వులు తదితర అంశాలపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఇప్పటికే వివిధ శాఖల్లో లక్షకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు ప్రకటించిన సిఎం కెసిఆర్ భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసారు. 80,039 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగా తెలంగాణ పరిధిలోని అన్ని యూనివర్సిటీల్లో 2,020 బోధన పోస్టులను, 2,774 బోధనేతర పోస్టుల ను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉన్నాయని తేలింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా రాష్ట్రంలోని నేరుగా నియామకం చేయా ల్సిన ఖాళీల సంఖ్య 80,039 ఉన్నట్లు తేలిందని సీఎం తెలిపారు. ఈ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందనే శుభవార్తను రాష్ట్ర యువతకు తెలియజేయడానికి సంతోషిస్తున్నానని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ భర్తీ పక్రియ వల్ల ఏటా సుమారు రూ. 7,000 కోట్ల అదనపు భారం రాష్ట్ర ఖజానాపై పడుతుందన్నారు. అయినా కూడా ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి ఖాళీలను ముందే గుర్తించి, ప్రతీ సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను ప్రకటించి, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని విభాగాలు తమ వద్ద ప్రతీ సంవత్సరం ఏర్పడే ఖాళీల వివరాలు సిద్ధం చేస్తాయి. నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు సమాచారం ఇస్తాయి. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం కేసీఆర్ తెలిపారు.మొత్తం తెలంగాణలో 91,142 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. నేటి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేస్తున్నట్లు అసెంబ్లీలో వెల్లడిరచారు. విద్యాశాఖలో 25 నుంచి 30 వేల వరకు పోస్టులు, కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామని కేసీఆర్ తెలిపారు. క్షణమే 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.అన్ని పోస్టుల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు ప్రకటించారు. 5 శాతం ఓపెన్ కోటాలో పోటీ పడొచ్చని కేసీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రకటనతో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సంబురాలు ఆకాశన్నాంటుతున్నాయి. కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం.. ఒక్కొక్కటిగా సాకారం చేసుకుంటూ వెళ్తోంది. భారీ ప్రాజెక్టులతో ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించి తెలంగాణను సస్యశ్యామలం చేసింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ మానస పుత్రిక అయిన మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరును అందించారు. ప్రభుత్వానికి వివిధ మార్గాల్లో సమకూరుతున్న ఆదాయ వనరులను సబ్బండ వర్గాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. అంతే కాకుండా ఏడేండ్లలోనే అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచి, తలసరి ఆదాయంలో నంబర్‌వన్‌గా నిలిచింది. మొత్తానికి నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రకటనను సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చేశారు. మొత్తం 91,142 పోస్టులను భర్తీ చేయనున్నట్టు వెల్లడిరచారు. తక్షణమే 80,039 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. కాగా.. రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్`1లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలంగాణలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించనున్నట్టు వెల్లడిరచారు. ఇకపై కాంట్రాక్ట్ పద్ధతితో నియామకాలు ఉండవన్నారు. కేసీఆర్ ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ పరిమితి పదేళ్లు పెంచాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా.. ఉద్యోగాల భర్తీకి వయోపరిమితి ఓసీ అభ్యర్థులకు 44, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49, దివ్యాంగులు 54 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక తెలంగాణలో ఏయే శాఖలో ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారో వివరాలు ఇలా ఉన్నాయి. గ్రూప్ `1 ` 503, గ్రూప్ `2 582గ్రూప్`3 ` 1,373, గ్రూప్`4ల ` 9,168 పోస్టుల భర్తీజిల్లా స్థాయిలో 18,866మల్టీజోన్‌లో 13,170 పోస్టులుఅదర్ కేటగిరి వర్సిటీలు 8,174పోలీస్ శాఖ 18,334సెకండరీ ఎడ్యుకేషన్ 13,086 పోస్టులువైద్యశాఖ 12,755ఉన్నత విద్యాశాఖలో 7778 పోస్టులుబీసీ వెల్ఫేర్ 4311 పోస్టులురెవెన్యూలో 3560 పోస్టులుఎస్సీ వెల్ఫేర్ 2879 పోస్టులుఇరిగేషన్‌లో 2692 పోస్టులుట్రైబర్ వెల్ఫేర్ 1825పర్యావరణ, ఫారెస్ట్ సైన్స్ 1598 పోస్టులుపంచాయతీరాజ్ 1455ఉపాధి 1221 పోస్టులుఆర్థిక శాఖ 1146స్త్రీశిశు సంక్షేమ శాఖ 895 పోస్టులుమున్సిపల్ 859వ్యవసాయం 801 పోస్టులురవాణా 563పశుసంవర్ధక శాఖలో 353 పోస్టులుపరిపాలన శాఖ 343యువజన, టూరిజం 184 పోస్టులుఎª`లానింగ్ 136సివిల్‌సప్లై 106అసెంబ్లీ 25ఎనర్జీ 16 పోస్టులు ఉన్నాయి. ఈ ప్రకటన మొదలు పెట్టగానే అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచారు. కెసిఆర్‌కు అబినందనలు తెలుపుతూ నినదించారు. యూనివర్సిటీల్లో భారీగా నియామకాలురాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ పక్రియను త్వరలోనే చేపడుతామని సీఎం శాసనసభా వేదికగా ప్రకటించారు. తెలంగాణ పరిధిలోని అన్ని యూనివర్సిటీల్లో 2,020 బోధన పోస్టులను, 2,774 బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉన్నాయని తేలింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా రాష్ట్రంలోని నేరుగా నియామకం చేయాల్సిన ఖాళీల సంఖ్య 80,039 ఉన్నట్లు తేలిందని సీఎం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ నియామక నోటిఫికేషన్లతో పాటు నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరో తీపి కబురు అందించారు. పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని పదేండ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనివల్ల మరింతమంది ఉద్యోగార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నదని సీఎం తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఓసీలకు 44 ఏండ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లకు, దివ్యాంగులకు 54 ఏండ్లకు గరిష్ట వయోపరిమితి పెరుగు తుందన్నారు. రాష్ట్రంలో ఇక నుంచి భర్తీ చేసే ఆర్డీవో, డీఎస్పీ, సీటీవో, ఆర్టీవోతో పాటు గ్రూప్`1 ఉద్యోగాలన్నీ లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకి వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఉద్యోగ నియామకాల భర్తీపై శాసనసభ వేదికగా సీఎం సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇందులో భాగంగా పలు విషయాలను వెల్లడిరచారు. కొత్తగా సాధించుకున్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ శాతం పెరగటమే కాకుండా స్థానిక రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని కేసీఆర్ తెలిపారు. గత ఉత్తర్వుల ప్రకారం ఆర్డీవో, డీఎస్పీ, సిటివో, ఆర్‌టీవో, డిస్టిక్ట్ రిజిస్టార్ర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తదితర గ్రూప్ 1 ఉద్యోగాలకు లోకల్ రిజర్వేషన్ వర్తించేది కాదు. ఇప్పుడు ఇవన్నీ కూడా లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకొచ్చామని కేసీఆర్ ప్రకటించారు.గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 60 నుంచి 80 శాతం వరకు మాత్రమే లోకల్ రిజర్వేషన్ పరిధి ఉండేది. ఇప్పుడు అన్ని పోస్టులకు 95 శాతం లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది అని స్పష్టం చేశారు. స్థానిక అభ్యర్థులు తమ స్వంత జిల్లా, జోన్, మల్టీ జోన్‌లలో 95 శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కలిగి ఉండడమే కాక ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్‌లలో 5 శాతం ఓపెన్ కోటా ఉద్యోగాలకు కూడా పోటీ పడవచ్చు అని సీఎం పేర్కొన్నారు. స్థానిక అభ్యర్థులు తమ జిల్లాలో జిల్లా కేడర్ పోస్టులకు తమ జోన్ లోని జోనల్ క్యాడర్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారని కేసీఆర్ స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత ఆయా ఉద్యోగాలకు పోటీ పడటానికి గతం కన్నా ఎక్కువ అవకాశాలు లభిస్తాయని తెలియజేస్తున్నానని సీఎం పేర్కొన్నారు. 7 జోన్లు, 33 జిల్లాల వారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగ ఖాళీలు, సిబ్బంది కొరత వంటి సమస్యలు తీరుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు.గ్రూప్ పోస్టులకు కూడా నోటిఫికేషన్లునిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక పక్రియ చేపడుతున్నామని శాసనసభలో ప్రకటించారు. ఇందులో గ్రూప్`1, గ్రూప్`2, గ్రూప్`3, గ్రూప్`4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్, మల్టీజోనల్, సెక్రటేరియట్, హెచ్‌ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. వీటిలో జిల్లాల్లో మొత్తం 39,829 పోస్టులు ఉన్నాయి. ఇక పై రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తేల్చిచెప్పారు. ఉద్యోగ నియామక నోటిఫికేషన్ల ప్రకటన సందర్భంగా ఈ విషయాన్ని కేసీఆర్ వెల్లడిరచారు. రాష్ట్రంలోని 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణకు కాంట్రాక్టు ఉద్యోగులు వారసత్వంగా లభించారు. ప్రభుత్వరంగంలో ఇంత పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండటం సబబు కాదని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే 2014 జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్న వారిని మానవీయ దృక్పథంతో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించింది. అయితే కొన్నిరాజకీయ పార్టీలు సంకుచిత మనస్తత్వంతో కోర్టులో కేసులు వేసిన నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వుల కారణంగా ఈ పక్రియ మధ్యలో నిలిచిపోయింది. ప్రభుత్వం పట్టు విడవకుండా న్యాయ పోరాటం చేసింది. ప్రభుత్వ పోరాటం ఫలితంగా గతేడాది డిసెంబరు 7న సంబంధిత రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలను వెలువరించింది. అవరోధాలన్నీ తొలగిపోయిన నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తున్నది. ఇక పై రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ నియామకాలుండవు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.ఇకనుంచి పక్కాగా లోకల్ రిజర్వేషన్లుఎక్కడి వారికి అక్కడే ఉద్యోగాల కల్పనరాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక రిజర్వేషన్లుహైదరాబాద్,మార్చి9(ఆర్‌ఎన్‌ఎ): రాష్ట్రంలో ఇక నుంచి భర్తీ చేసే ఆర్డీవో, డీఎస్పీ, సీటీవో, ఆర్టీవోతో పాటు గ్రూప్`1 ఉద్యోగాలన్నీ లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకి వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభా వేదికగా ప్రకటించారు. ఉద్యోగ నియామకాల భర్తీపై శాసనసభ వేదికగా సీఎం సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇందులో భాగంగా పలు విషయాలను వెల్లడిరచారు. కొత్తగా సాధించుకున్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ శాతం పెరగటమే కాకుండా స్థానిక రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని కేసీఆర్ తెలిపారు. గత ఉత్తర్వుల ప్రకారం ఆర్డీవో, డీఎస్పీ, సిటివో, ఆర్‌టీవో, డిస్టిక్ట్ రిజిస్టార్ర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తదితర గ్రూప్ 1 ఉద్యోగాలకు లోకల్ రిజర్వేషన్ వర్తించేది కాదు. ఇప్పుడు ఇవన్నీ కూడా లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకొచ్చామని కేసీఆర్ ప్రకటించారు. గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 60 నుంచి 80 శాతం వరకు మాత్రమే లోకల్ రిజర్వేషన్ పరిధి ఉండేది. ఇప్పుడు అన్ని పోస్టులకు 95 శాతం లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది అని స్పష్టం చేశారు. స్థానిక అభ్యర్థులు తమ స్వంత జిల్లా, జోన్, మల్టీ జోన్‌లలో 95 శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కలిగి ఉండడమే కాక ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్‌లలో 5 శాతం ఓపెన్ కోటా ఉద్యోగాలకు కూడా పోటీ పడవచ్చు అని సీఎం పేర్కొన్నారు. స్థానిక అభ్యర్థులు తమ జిల్లాలో జిల్లా కేడర్ పోస్టులకు తమ జోన్ లోని జోనల్ క్యాడర్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారని కేసీఆర్ స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత ఆయా ఉద్యోగాలకు పోటీ పడటానికి గతం కన్నా ఎక్కువ అవకాశాలు లభిస్తాయని తెలియజేస్తున్నానని సీఎం పేర్కొన్నారు. 7 జోన్లు, 33 జిల్లాల వారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగ ఖాళీలు, సిబ్బంది కొరత వంటి సమస్యలు తీరుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు.