కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
` మోదీ, కేసీఆర్, నా పాలనపై చర్చిద్దామా!
` కేసీఆర్, కిషన్ రెడ్డిలకు సీఎం రేవంత్ బహిరంగ సవాల్
` పాలమూరు ప్రాజెక్టులను ఎండబెట్టిన ఘనత కెసిఆర్‌దే
` ఉమ్మడి జిల్లా అభివృద్ది కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తా
` మెడికల్ కాలేజీకి చిట్టెం నర్సిరెడ్డి పేరు ఖరారు
` పేదవాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు
` ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తాం
` నారాయణపేట జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన
` నియోజకవర్గానికో పెట్రోల్ బంక్ కేటాయిస్తా
` ఏటా రెండు చీరలు పంపిణీ చేస్తాం
` నారాయణపేట జిల్లా పర్యటనలో సిఎం రేవంత్ రెడ్డి వెల్లడి
నారాయణపేట జిల్లా బ్యూరో (జనంసాక్షి): కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా చెప్పారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. నారాయణపేటలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్‌ను రేవంత్ ప్రారంభించారు. మహిళలో ముఖాముఖీ మాట్లాడిన రేవంత్.. కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్చుతామని చెప్పారు. ఇందిరా మహిళా శక్తిలో 67 లక్‌ష్లల మంది ఉన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేస్తాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. 1000 మెగావాట్ల సోలార్ పవర్ ను మహిళా సంఘాలకు అప్పగించాం. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తాం. శిల్పారామం పక్కనే పెద్ద వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. మహిళా సంఘాలు ఆర్థికంగా మరింత ఎదగాలి. గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలె. 1000 కోట్లతో మహిళా సమాఖ్య సభ్యులకు చీరలు ఇస్తాం. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనే ఏడాదిలో రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించాం. గత ప్రభుత్వం మామూలు చీరలు ఇచ్చేది..మేం నాణ్యమైన చీరలు ఇస్తాం అని రేవంత్ అన్నారు. రాష్ట్ర,కేంద్రం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. ఎన్నికలప్పుడే రాజకీయాలు..మిగతా టైంలో అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలన్నారు. నియోజకవర్గానికి ఒక్కమహిళా సమాఖ్యకు పెట్రోల్ బంక్ ఇస్తాం అన్నారు. కోటి మంది మహిళలతో ఓఆర్‌ఆర్ దగ్గర భారీ ప్రదర్శన చేద్దాం రండి అని రేవంత్ పిలుపునిచ్చారు. మహిళా సమాఖ్య సభ్యులకు ఏడాదికి రెండు చీరలు అందజేస్తామని ప్రకటించారు. నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా అప్పక్‌ప్లలెలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రవ్యాప్తంగా మహిళా సమాఖ్యలో మొత్తం 67లక్షల మంది ఉన్నారు. ఈ సభ్యులకు ఇకపై రూ. 1000 కోట్ల ఖర్చుతో ఏడాదికి రెండు మంచి చీరలు ఇస్తాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. శిల్పారామం వద్ద మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఏర్పాట్లు చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటును మహిళలు నిర్వహించబోతున్నారు. తొలుత ప్రతి జిల్లాలో ఒక చోట ప్రభుత్వ భూముల్లో మహిళా సమాఖ్యలకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కటైనా ఉండేలా చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో స్కూళ్ల నిర్వహణ బాగుండేలా మహిళలు చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులు లేకపోయినా, వసతులు సరిగా లేకపోయినా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లండి. నిధులు నేనిస్తా.. నిర్వహణ విూ చేతుల్లో ఉంటుంది. నిధులు ఇచ్చినా నిర్వహణ బాగాలేకపోతే ప్రయోజనం ఉండదు. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహిస్తున్నామో బడి కూడా అలాగే నిర్వహించాలని రేవంత్‌రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, పంచాయతీరాజ్, గ్రావిూణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ఎక్సైజ్ మరియు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ, స్థానిక శాసనసభ్యులు పర్ణిక రెడ్డి, అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ, శాసనసభ్యులు వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, సర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కెసిఆర్, కిషన్ రెడ్డిలకు సిఎం రేవంత్ బహిరంగ సవాల్
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన ..11 ఏళ్లు మోదీ పాలన.. ఏడాది కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్దమా అని సిఎం రేంవత్ అన్నారు. కేసీఆర్, కిషన్ రెడ్డి చర్చకు రావాలని అన్నారు.చర్చలో తాను ఓడితే ముక్కు నేలకు రాస్తానని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలకు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.ప్రజాపాలన బాగలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55 వేల ఉద్యగాలు ఇచ్చాం. .21 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశామని చెప్పారు. పరిశ్రమలు ,ప్రాజెక్టులు రాకుండా బీఆర్‌ఎస్,బీజేపీ అడ్డుకుంటుందని మండిపడ్డారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మక్తల్, నారాయణపేట్ ,కొడంగల్ ప్రాజెక్టులను మొదలు పెట్టానన్నారు. కేసీఆర్ గట్టిగా కొడతానంటున్నావ్.. గట్టిగా కొట్టడానికి అది ఫుల్లా.. ఆఫా.. కొట్టాలనుకుంటే ముందుగా విూ బిడ్డను ,కొడుకును, అల్లుడిని కొట్టు..మమ్మల్ని కొడితే మా కార్యకర్తలు ఊరుకుంటారా? ఇచ్చిన హావిూలను ఐదేళ్లలో పూర్తి చేసే బాద్యత నాదే అని రేవంత్ అన్నారు. గత పాలకులు పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘పదేళ్ల పాటు ఏగ్రామంలో పేదలకు ప్రభుత్వ ఇళ్లు దక్కలేదు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించింది. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు. అంతకు ముందు ఎంపీగా గెలిపిస్తే.. ఏ నాడూ పాలమూరు గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించలేదు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఈ జిల్లాకు న్యాయం జరగలేదు. గతంలో కొందరు సీఎంలు పాలమూరు పేరు చెప్పి రాజకీయం చేశారు కానీ, జిల్లాకు చేసిందేవిూ లేదు. భీమ, నెª`టటెంపాడు, కోయిల్‌సాగర్, సంగంబండం, కల్వకుర్తి ప్రాజెక్టుల పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు. పదేళ్లలో పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఇవాళ చంద్రబాబుతో పంచాయితీ ఉండేది కాదు. వైఎస్‌ఆర్, జగన్ పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే కేసీఆర్ నోరెత్తలేదు. నా విూద పగతో మక్తల్`నారాయణపేట`కొడంగల్ ప్రాజెక్టును పక్కన పడేశారు.ప్రజా పాలన సరిగా లేదని విమర్శలు చేస్తున్నారు. పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, 12 ఏళ్ల నుంచి మోదీ ప్రధానిగా ఉన్నారు, 12 నెలలుగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి చర్చకు వస్తే ముఖ్యమంత్రిగా నేను సిద్ధం. గత పదేళ్ల పాలనపై చర్చిద్దాం.. చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా. పదేళ్లలో ఏవిూ చేయని వాళ్లు ఏడాదిలోనే కాంగ్రెస్ ఏవిూ చేయలేదని అంటున్నారు. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు, పరిశ్రమలను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారు. మోసగాళ్ల మాటలు విని భూసేకరణను అడ్డుకోవద్దు. భూమి కోల్పోయిన వారికి మంచి పరిహారం ఇచ్చి న్యాయం చేసే బాధ్యత నాదని సీఎం అన్నారు. ఇకపోతే ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం ఎన్ని వేల కోట్లయినా ఖర్చుచేస్తానన్నారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లిలో మెడికల్ కాలేజీ,హాస్టల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన రేవంత్..70 ఏండ్ల తర్వాత మహబూబ్ నగర్ జిల్లా వ్యక్తికి సీఎం అయ్యే అవకాశం వచ్చింది. జిల్లా అభివృద్ది కోసం చేయాల్సినవన్నీ చేస్తా. నా జిల్లా అభివృద్ది కోసం ఎన్నివేల కోట్ల రూపాయలైనా రాష్ట్ర బడ్జెట్లో కేటాయిస్తా. జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటా. ఇక్కడి మెడికల్ కాలేజీకి చిట్టెం నర్సిరెడ్డి పేరు పెట్టాలని అదేశిస్తున్నా అని రేవంత్ అన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే పర్ణికా ఓ డాక్టర్ కావడం ఇక్కడి మెడికోల అదృష్టమన్నారు. విూ అవసరాలు ఎంఎల్‌ఏ కు చెప్పాల్సిన పనిలేదు. ఈ వృత్తి ఓ మానవీయ దృక్పథంతో చేయాల్సిన పని. ఇక్కడి పారా మెడికల్ సిబ్బందికి మిడిల్ ఈస్ట్ లో చాలా డిమాండ్ ఉంది.. ఆ కోవలో కూడా విూ ఉపాధి కోసం ప్రభుత్వం ఆలోచిస్తుంది. జీవితంలో ఇది చాలా కీలక సమయం.. విూరు వినియోగించుకుని చదువులో రాణించాలి. పేదలకు నాణ్యమైన వైద్యంఅందాలి. మారుమూల గ్రామాల పేదలకు వైద్య సేవలందిస్తాం. టీచింగ్,నాన్ టీచింగ్ స్టాఫ్ లేకుండా గొప్ప డాక్టర్లు కాలేరు. అద్దాల మేడలు అభివృద్ది కాదని అంబేద్కర్ చెప్పారు. మెడికల్ కాలేజీలకు నిధుల లోటు రానివ్వం అని రేవంత్ అన్నారు. బి. దేవమ్మ ,భర్త నర్సింగ్ కు చెందిన స్థలంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కు భూమి పూజ చేశారు.ముఖ్యమంత్రి తో పాటు రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ,రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు,రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క,రాష్ట్ర గృహ నిర్మాణ స్పెషల్ సెక్రటరీ వి.పి.గౌతం,జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్,మహబూబ్ నగర్ ఎం.పి.డి.కె.అరుణ, నారాయణ పేట శాసన సభ్యురాలు పర్ణికా రెడ్డి,మక్తల్ శాసన సభ్యులు వాకిటి శ్రీ హరి, షాద్ నగర్ శాసన సభ్యులు వీర్ల పల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు
రేణుకతల్లిక పట్టువస్త్రాలు సమర్పణ
వికారాబాద్(జనంసాక్షి):వికారాబాద్ జిల్లా పోలేపల్లిలో రేణుక ఎల్లమ్మ తల్లిని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు రేవంత్‌రెడ్డికి అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. సీఎం వెంట మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.