కోటి సంతకాల సేకరణ సిగ్గుచేటు : ముద్దు కృష్ణమనాయుడు

హైదరాబాద్‌: ప్రజాధనం లక్ష కోట్లు దండుకున్న జగన్మోహన్‌రెడ్డి విడుదలకు వైకాపా కోట సంతకాల సేకరణచేపట్టడం సిగ్గుచేటని తెలుగుదేశం నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. 2004లో లక్షలో ఉన్న జగన్‌ ఆదాయం ఏడేళ్లలో వందల కోట్లకు ఎలా పెరిగిందో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు.