కోయగుడెం పిట్ 3 పూసపల్లి,రొంపెడు ఓసిల ప్రైవేటీకరణను అడ్డుకుందాం

తెగించి పొరాడితెనె ఇల్లందు ఏరియా కు మనుగడ
–కేఓసి ఫిట్ మీటింగ్ లో సారయ్య

టేకులపల్లి, నవంబర్ 3 (జనం సాక్షి): కోయగూడెం ఫీట్ 3, పూసపల్లి, రొంపేడు ఓసీల ప్రైవేటీకరణను అడ్డుకుందామని, తెగించి పోరాడితేనే ఇల్లందు ఏరియాకు మనుగడని వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కే సారయ్య అన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యునియన్ ఎఐటియుసి ఆద్వర్యంలో కొయగుడెం ఓసిపి నందు గురువారం ఉదయం షిఫ్ట్ నందు ఫిట్ మీటింగ్ నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని కార్మికులకు రావలసిన11 వ వేజ్ బోర్డు పరిష్కరించడంలో కాలయాపన చేస్తూన్నదని,మినిమం గ్యారెంటీ బెనిఫిట్ 50 శాతం ఇవ్వాలని జాతీయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాని ప్రభుత్వం పదిశాతం ఇస్తామంటున్నదని, డిపిఈ గైడ్ లైన్స్ ప్రకారం పెరుగుదల ఉంటుందని, యాజమాన్యం ప్రభుత్వ ప్రతిపాదనను ఎఐటియుసి వ్యతిరేకించామని అన్నారు. సింగరేణి సంస్థ లాభాలను పక్కదారి పట్టిస్తున్నారని జెన్కో నుండి రావలసిన బకాయిలు వసులు చేయకుండా కంపెనీ రావలసిన వడ్డిని మాఫీచేయడం సరికాదని అన్నారు. సింగరేణి ఓపెన్ కాస్టులలొ బొగ్గు వేలోకి తీసే పక్రియను ప్రైవేటు వారికి అప్పజెబుతున్నారని అన్నారు.ఈ విధానాన్ని ఎఐటియుసి వ్యతిరేకిస్తుందని అన్నారు. కొయగుడెం ఓసిపి పిట్ 3 ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఉద్యమాలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని జెకె 5 ఓసి విస్తరణ లొ భాగంగా పూర్తిగా ప్రైవేటు వారికి అప్పచెప్పే పక్రియ ను మానుకోవాలని, పూసపల్లి, రొంపెడు ఓసిపిల పనులను సింగరేణి సంస్థనే చేప్పట్టాలని వారు ఈసందర్భంగా యాజమాన్యంను డిమాండ్ చెసారు. ఇల్లందు ఏరియా కాపాడుకునే భాద్యత మనందరిపై ఉందని దాని కొసం కార్