కోలాహలంగా ప్రచారం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 2 (: ఆర్టీసీ సంస్థలో ఎన్నికల సైరన్‌ మోగింది. ప్రతి రెండు సంవత్సరాల
ఒకసారి ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 22న గుర్తింపు సంఘం ఎన్నికలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లాలో ఎన్నికల కోలాహాలం ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా ఆరు డిపోలు ఉండగా వీటి పరిధిలో 2 వేల 218 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2 వేల 114 మంది రెగ్యూలర్‌ కార్మికులు కాగా 104 మంది ఒప్పంద కార్మికులు ఉన్నారు. వీరందరు రాష్ట్ర, స్థానిక గుర్తింపు సంఘాల కోసం రెండు ఓట్లు వెయనున్నారు. గత ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా ఎన్‌ఎంయు  ఎన్నికయింది. ఈ సారి ఎన్నికల్లో స్టాప్‌ అండ్‌ వర్క్స్‌ యునియన్‌, ఇప్లాయిస్‌ యునియన్‌, తెలంగాణ మజ్దూరు యునియన్‌, ఎన్‌ఎంయులు పోటీ చేయనున్నారు.